నల్గొండ
Thursday, July 27, 2017 - 12:12

నల్లగొండ : జిల్లా కోర్టు దగ్గర లక్ష్మి అనే మహిళ హంగామా సృష్టించింది. సూర్యాపేటకు చెందిన లక్ష్మి కోర్టు దగ్గరున్న ఓ భవనంపైకి ఎక్కింది. అక్కడి నుంచి దూకుతానంటూ బెదిరించింది. ఓ కేసు విషయంలో న్యాయం జరగడం లేదని ఆరోపించింది. గతంలో సూర్యాపేట కలెక్టరేట్‌ దగ్గర కూడా లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది.

 

Wednesday, July 26, 2017 - 17:36

నల్లగొండ : జిల్లా యాద్గార్‌పల్లి పల్లి సమీపంలో వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు జూలకంటి. బ్రిడ్జి స్లాబ్ కృంగి ఎగుడు దిగుడుగా ఉందన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన నడుస్తున్నాయని.....

Wednesday, July 26, 2017 - 13:13

నల్లగొండ : జిల్లాలోని చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐఎఫ్‌సీఐ గోదాం వద్ద జాతీయ రహదారిపై బోలెరో వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి...

Friday, July 21, 2017 - 11:24

నల్లగొండ : జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు నర్సులు డాక్టర్‌ అవతారమెత్తారు. అర్హత లేకున్నా గర్భిణికి ప్రసవం చేయగా.. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు మృతి చెందారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బకరు చనిపోయారని బంధువులు ఆందోళనకు దిగారు. 

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Saturday, July 15, 2017 - 18:56

నల్లగొండ : పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలో దొండ రైతులు ధర్నా నిర్వహించారు. దొండ రైతులు సెక్రటేరియట్‌ను ముట్టడిస్తారన్న అనుమానంతో శుక్రవారం రాత్రి పోలీసులు కొందరు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. తమకు అలాంటి ఉద్దేశ్యమే లేకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో రైతుల్ని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించడంతోపాటు.....

Friday, July 14, 2017 - 09:33

నల్గొండ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దెబ్బ తాకింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నాణ్యతా లోపం బయటపడింది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయితీలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఇళ్ల పనులు పూర్తి కాకుండానే లోపాలు బయటపడుతున్నాయి. మెట్ల స్లాబ్‌ విరిగిపడి ఒక వ్యక్తికి...

Thursday, July 13, 2017 - 21:31

నల్లగొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డిలు కలిసి పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. ముగ్గురు మంత్రులు ఒకేసారి అభివృద్ది పనుల శంఖుస్థాపనలలో పాల్గొనడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు....

Thursday, July 13, 2017 - 16:39

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడకు చెందిన వాస్తు నిపుణులు మామిడి సత్యనారాయణ తన పేరున వచ్చిన తెల్లరేషన్‌ కార్డును తిరస్కరించి ఔనత్యాన్ని చాటుకున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌కు హైదరాబాద్‌లో కార్డును అందజేశారు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదని..పేదవాడినని అంగీకరించడం తప్పు అని సత్యనారాయణ అన్నారు. ఆర్థిక స్తోమత ఉండి పేదవారు తినే బియ్యం కొరకు ఆశపడటం తప్పు అని భావించి వైట్‌ రేషన్‌ కార్డును...

Wednesday, July 12, 2017 - 13:05

నల్లగొండ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి... రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ... నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటిస్తూ తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ... కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రెండు పర్యాయాలు...

Pages

Don't Miss