నల్గొండ
Monday, January 30, 2017 - 17:49

నల్లగొండ : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. జిల్లాలోని గాజుపేట గుహలను సందర్శించేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. టార్చ్ లైట్లను వేసుకుని గుహలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆ వెలుతురుకు తేనె టీగలు ఒక్కసారిగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తోపాటు అతని అనుచరులపై దాడి చేశాయి. ఈఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందికి గాయాలయ్యాయి. రవీంద్రకుమార్...

Monday, January 30, 2017 - 17:11

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కోరారు. ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు.

 

Monday, January 30, 2017 - 09:25

నల్లొండ : జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు జారిపడ్డారు. ఇందులో ఇద్దరు గల్లంతుకాగా..ఒకరిని లారీ డ్రైవర్‌ రక్షించాడు. గల్లంతైనవారు 24 ఏళ్ల నానాజి, 40 ఏళ్ల లచ్చుగా గుర్తించారు. గల్లంతైన వారిది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సువరం వాసులుగా గుర్తించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు విస్త్రతంగా...

Sunday, January 29, 2017 - 10:43

నల్లగొండ : జిల్లాలోని చండూరులో విషాదం చోటుచోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్‌ ప్రయాణికులను సురక్షితంగా ఉంచి తన ప్రాణాలు కోల్పోయాడు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గంమధ్యలో చండూరులో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సును డ్రైవర్‌ విష్ణు పక్కకు ఆపాడు. వెంటనే విషయం గ్రహించిన తోటి ప్రయాణికులు కండక్టర్‌ కలిసి...

Saturday, January 28, 2017 - 12:51

నల్గొండ : జిల్లాలో దారుణం జరిగింది. అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సమాజంలో ఆడ పిల్లగా పుట్టడం నేరమైపోయింది. ఆడపిల్లలపై వివక్ష మరోసారి బయటపడింది. కన్నకూతురిని అల్లారుమద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులే కాలయములయ్యారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో పసికందును తల్లిదండ్రులే చంపేశారు. చందంపేట మండలంలో జరిగింది. మూడవత్ శారదకు ఇప్పటికే ఇద్దరు ఆడపల్లిలు, ఒక బాబు ఉన్నారు. ఇటీవలే దేవరకొండ...

Friday, January 27, 2017 - 18:04

హైదరాబాద్: నల్లగొండలో కాంట్రాక్టర్‌ నుంచి రూ.6లక్షలు లంచం తీసుకుంటూ..ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రమణనాయక్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మారెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాను హైదరాబాద్‌లో ఉండడంతో లక్ష్మారెడ్డికి మనీ ఇవ్వాలని రమణనాయక్‌ ఫోన్‌లో ఆదేశించాడు. దీంతో కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డికి మనీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత ఆగస్టులో జరిగిన కృష్ణా...

Saturday, January 21, 2017 - 21:12

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. నల్గొండ, వరంగల్ జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు నల్గొండ పై వరంగల్ విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, January 18, 2017 - 10:49

నల్లగొండ: దామరచర్ల మండలం రాళ్లవాగుతండా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. సాహితీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం... నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జరుగుతున్న విజ్ఞాన ప్రదర్శనకు సూర్యాపేట నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. రాళ్లవాగు తండా వద్ద ఓ హోటల్‌లో భోజనం చేసి.....

Monday, January 16, 2017 - 17:34

నల్గొండ : యాదాద్రిలో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా జరిగింది. అగాఖాన్‌ ఫౌండేషన్‌, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 31 దేశాల నుంచి 75 మంది కైటిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, యాదాద్రి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ పాల్గొన్నారు.

Saturday, January 14, 2017 - 08:16

నల్గొండ : మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. చిట్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మణం చెందారు. చిట్యాల సమీపంలో విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారు జామున 3 గంటల సమయంలో లారీ, తుపాన్ వాహనం ఒకదానికికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ...

Pages

Don't Miss