నల్గొండ
Saturday, March 4, 2017 - 19:42

నల్గొండ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ అమలు చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తమ్మినేని నేతృత్వంలో మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో సాగుతోంది. పలుచోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వ మెడలు వంచైనా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు సాధిస్తామన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీని అమలు చేయాలని డిమాండ్‌...

Friday, March 3, 2017 - 13:34

నల్గొండ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు గోరెంకలపల్లి, మామిడాల స్టేజి, ఇండ్లూరు, తిప్పర్తి, కొత్తగూడెం, మాడుగులపల్లి, వేములపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. పేదల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేయడం లేదని.. అందరికీ సామాజిక న్యాయం కోసమే మహాజన పాదయాత్ర చేస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర...

Friday, March 3, 2017 - 10:16

నల్గొండ : అన్ని కులాలకు..అన్నింట్లో సమాన వాటా, సమాన గౌరవం వచ్చినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు కాబట్టే టీఆర్‌ఎస్‌ పాలకులు తమతో చర్చలకు రాలేదని తమ్మినేని విమర్శించారు. ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై చర్చించడానికి రావాలని కోరితే టీఆర్‌ఎస్ పాలకులు తోక ముడిచారని సీపీఎం రాష్ట్ర...

Thursday, March 2, 2017 - 14:36

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 137వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం సూర్యపేట జిల్లా నుండి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా సీపీఎం నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఉప్పర్ పాడు స్టేజి వద్ద తమ్మినేని బృందానికి పూలతో స్వాగతం పలికారు. పాదయాత్ర ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్ని పనులు చేస్తోందని, ఇంకా అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర...

Thursday, March 2, 2017 - 13:54

నల్గొండ : మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యంమత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను గుర్తించి తక్షణమే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలని మహాజన పాదాయాత్ర కొనసాగుతోందని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.  ...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 19:54

నల్లగొండ : జిల్లాలో నాగార్జున సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ కుడి కాలువకు 15.2 టీఎంసీల నీరు విడుదలైందని నీటిసరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. మరోనైపు ఏపీ అధికారులు మాత్రం 13.2 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారని మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 09:37

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపుకు ఆపార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 5 నెలలు,..4వేల కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర మార్చి 19న హైదరాబాద్‌లో నిజాం గ్రౌండ్‌లో ముగింపుగా తెలంగాణ సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, వివిధ వామపక్ష, సామాజిక సంఘాల నేతలు 50మందికిపైగా పాల్గొననున్నారు. పార్టీలతో...

Sunday, February 26, 2017 - 09:36

ఖమ్మం : ప్రజాసొమ్ముతో కేసీఆర్‌ మొక్కులు తీర్చుకోవడం నేరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దేవుడి మొక్కులు తీర్చుతున్న కేసీఆర్‌..ఎన్నికల్లో ప్రజలకు హామీలు నెరవేర్చడం లేదని తమ్మినేని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోకముడిచారని తమ్మినేని మండిపడ్డారు. మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందని విమర్శ సీపీఎం...

Pages

Don't Miss