నల్గొండ
Sunday, February 4, 2018 - 22:00

నల్గొండ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని లెఫ్ట్‌ నేతలు స్పష్టం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా వామపక్షపార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు నల్లగొండలో ఘనంగా మొదలయ్యాయి. అన్ని వామపక్ష పార్టీలతో కలిసి విశాల ఐక్య ఉద్యమాలు నిర్మించనున్నట్టు సమావేశంలో సీపీఎం నాయకులు తెలిపారు.
సీపీఎం మహాసభలు ఘనంగా...

Sunday, February 4, 2018 - 20:10

నల్గొండ : కాంగ్రెస్‌ పార్టీ కోసం, కార్యకర్తలకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధమన్నారు కాంగ్రెస్‌నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్‌యే కిరాయి రౌడీలను పెట్టించి తనను బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. శ్రీనివాస్‌ హత్యతో కేసీఆర్‌ ప్రమేయం లేకపోతే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. లేదంటే ఈ హత్యకు కారణం కేసీఆర్‌ అని ప్రజలు నమ్ముతారన్నారు....

Sunday, February 4, 2018 - 20:07

నల్గొండ : కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో జిల్లా మంత్రికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభను ఇవాళ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్‌ హత్య వెనకాల రాజకీయ కుట్ర...

Sunday, February 4, 2018 - 18:41

నల్గొండ : కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో జిల్లా మంత్రికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభను ఇవాళ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్‌ హత్య వెనకాల రాజకీయ...

Sunday, February 4, 2018 - 18:35

నల్గొండ : రాజ్యాధికారమే లక్ష్యంగా సీపీఎం కార్యకర్తలు పనిచేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఎం ఎదిగేలా కార్యకర్తల పని ఉండాలన్నారు. ఇందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడిందని తెలిపారు. 

Sunday, February 4, 2018 - 18:31

నల్గొండ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలుసహా అన్ని తరగులు ప్రజానీకంపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పసి పిల్లలు మొదలుకొని... మహిళల వరకు లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నుంచి భారత దేశానికి విముక్తి కల్పించాలన్నారు. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు...

Sunday, February 4, 2018 - 18:26

నల్లగొండ : ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభసూచికంగా నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌ కవాతు నిర్వహించారు. భారీ ఎర్రజెండాలు చేబూని సీపీఎం అగ్రనేతలు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో నల్లగొండ ఎర్రగొండగా మారింది. అనంతరం లక్ష్మీ గార్డెన్స్‌లో బహిరంగ సభ నిర్వహించారు. 

 

Sunday, February 4, 2018 - 17:42

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు వాగ్దానాలేతప్ప... పెద్దగా నిధుల కేటాయింపు జరుగలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శింవచారు. సామాన్యులపై పన్నుల భారం మోపిన కేంద్రం... ధనికులపై పైసా పన్ను వేయలేదన్నారు.  మోదీ ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదని ధ్వజమెత్తారు.  నల్లగొండలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

Sunday, February 4, 2018 - 17:15

నల్గొండ : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీసర్కార్ విఫలమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని కూడా పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. కనీస వేతనాలు అమలు...

Pages

Don't Miss