నల్గొండ
Sunday, February 4, 2018 - 09:31

నల్లగొండ : నేటి నుంచి నల్లగొండలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగునున్నాయి. ఈ మహాసభలు నాలుగు రోజులు పాటు జరుగుతాయి. ఈ సభల్లో సీపీఎం జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాసేపట్లో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాత్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 4, 2018 - 07:53

నల్లగొండ : దారుణ హత్యకుగురైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. ఇది మామూలు హత్యకాదని... పక్కా ప్లాన్‌గా జరిగినట్టు ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిందితుల కాల్‌డేటాతో ఈ వ్యవహారం మొత్తం వెలుగుచూస్తోంది. మొత్తం శ్రీనివాస్‌ మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. శ్రీనివాస్‌ది రాజకీయ హత్యేనంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న...

Saturday, February 3, 2018 - 22:17

నల్గొండ : శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు తిరిగివచ్చి విధుల్లో చేరారు. నిన్నటి నుంచి ఆయన అదృశ్యమయ్యాడని కలకలం చెలరేగింది. గత కొన్ని రోజులుగా నిద్రలేమితో ఉండటం వల్ల విశ్రాంతి కోసమే వెళ్లినట్లు తెలిపారు. అందువల్లే ప్రభుత్వం ఇచ్చిన సిమ్, రివాల్వర్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ, అధికారుల...

Saturday, February 3, 2018 - 22:05

నల్లగొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో కాల్‌ డేటా కీలకంగా మారింది. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేముల బ్రదర్స్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. హత్యకు ముందు తర్వాత నిందితులతో వేముల సుధీర్‌, రంజిత్‌ సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ హత్యకేసులో ఏ-1 నిందితుడు చింతకుంట్ల రాంబాబు.. వేముల రంజిత్‌,...

Saturday, February 3, 2018 - 19:36

నల్లగొండ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు ఉద్యమాల గడ్డ నల్లగొండ వేదిక కానుంది. మూడేళ్ల కార్యక్రమాలను సమీక్షించుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయిలో భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ఈ మహాసభల్లోనే రూపొందించనున్నారు. గత ఉద్యమాలకు భిన్నంగా తెలంగాణలో లాల్‌ నీల్‌ జెండాలతో సామాజిక, వర్గ పోరాటాలకు సీపీఎం శ్రీకారం చుట్టిన తర్వాత తొలిసారిగా మహాసభలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక...

Saturday, February 3, 2018 - 18:30

నల్లొండ : సీఐ అదృశ్యం మిస్టరీ వీడింది. నిన్న అజ్ఞాతంలోకి వెళ్లిన సీఐ వెంకటేశ్వర్లు గుంటూరుజిల్లా బాపట్లలో గుర్తించిన పోలీసులు.. నల్గొండకు తీసుకొస్తున్నారు. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ముందు సీఐ వెంకటేశ్వర్లును ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Saturday, February 3, 2018 - 11:28

నల్గొండ : జిల్లా టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రెండు రోజులుగా ఆయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. జిల్లా ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డు పల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఈయన విచారణ అధికారిగా ఉన్నారు. విచారణ జరుగుతుండగానే ఈయన కనిపించకపోవడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఆయన ఆచూకి కనుక్కొనేందుకు పోలీసులు గాలించారు.

సెల్ ఫోన్, గన్ ను...

Saturday, February 3, 2018 - 09:14

నల్గొండ : జిల్లా టూ టౌన్ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లు ఆచూకీ ఇంకా లభించలేదు. జిల్లా ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డు పల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఈయన విచారణ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం నుండి ఈయన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్లతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు...

Saturday, February 3, 2018 - 08:14

నల్గొండ : జిల్లాలో పలు విషాదఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను ఇటీవలే హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇతని సంతాప సభ కోసం జిల్లాకు వచ్చిన క్యాటరింగ్ యువకులు దుర్మరణం పాలయ్యారు.

సంతాప సభ ఏర్పాట్లను ఓ ఈవెంట్ సంస్థకు ఇచ్చారు. ఈవెంట్ లో పనిచేసే నలుగురు యువకులు జిల్లాకు వచ్చారు. బస్సులో ఎక్కిన వారు గమ్య స్థానం...

Friday, February 2, 2018 - 15:15

నల్లగొండ : నగర్ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న సీఐ అజ్ఞాతంలోకి వెళ్లారు. కానిస్టేబుల్ ద్వారా ఆయన పిస్టల్ సరెండర్ చేశారు. రాజకీయ ఒత్తిడితోనే అతను ఇలా చేశాడని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss