నల్గొండ
Wednesday, April 4, 2018 - 13:00

నల్గొండ : జిల్లాలో మిర్యాలగూడలో లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నిర్భంద తనిఖీల్లో తాళ్ల ఏరియాలో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 109 ద్విచక్రవాహనాలు, ఒక కారు, 14 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకోగా అక్రమంగా గ్యాస్ సిలిండర్ లను సైతం స్వాధీనం చేసుకున్నారుర. అనుమానితులుగా భావిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులుసూచించారు. మొత్తం 150 మంది...

Monday, April 2, 2018 - 19:33

నల్లగొండ : జిల్లాలో ఈదురుగాలుతో  వచ్చిన అకాల వర్షానికి రైతాంగానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలో నష్టపోయిన పంటలను, ధ్వంసమైన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం, రైతుసంఘల నేతలు పరిశీలించారు. మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, నకిరేకల్ మండలాల పరిధిలో వేలాది ఎకరాల వరి పంటలు ఈదురు గాలులకు నేలకు వాలాయి...

Monday, April 2, 2018 - 19:28

నల్గగొండ : అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నల్లగొండలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి.  క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నుంచి భాస్కర్‌ థియేటర్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు...

Monday, March 26, 2018 - 18:56

నల్లగొండ : ఏప్రిల్ 18 నుండి 22 వరకు జరిగే 22వ అఖిల భారత మహాసభల సందర్భంగా చేపట్టిన బస్సుయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చేరింది. హైదరాబాద్‌లో జరిగే ఈ మహాసభలకు సుమారు వెయ్యి మంది మేధావులు పాల్గొంటారని సీపీఎం నేతలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామన్నారు.

Sunday, March 25, 2018 - 21:22

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడాయి. తెలంగాణ, ఏపీలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు కర్నాటకలోని గుల్బర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.

14 మంది ప్రయాణికులతో...

Sunday, March 25, 2018 - 19:10

నల్లగొండ : ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో వివాహం జరిపించాలంటూ.. ఓ యువతి.. నల్గొండలో దీక్షకు దిగింది.నల్గొండకు చెందిన ఓ యువతి... ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పనిచేస్తోంది. అదే హాస్పిటల్‌లో ఉపేందర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి మాట ఎత్తే సరికి కొన్నళ్లగా రకరకాల సాకులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో...

Sunday, March 25, 2018 - 13:54

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి రావులపాలెం వెళ్తున్న కారు ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా  మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. 

 

Saturday, March 24, 2018 - 20:57

హైదరాబాద్ : ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగే సీపీఎం అఖిల భారత 22వ మహాసభల ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు జీపు జాతాలు, మరోవైపు పాటలతో సీపీఎం ప్రచారం నిర్వహిస్తోంది. మహాసభల విజయంతమే లక్ష్యంగా రెండు జీపు జాతాలను సీపీఎం ప్రారంభించింది. అంతేకాదు మహాసభ పాటలనూ విడుదల చేసింది. వచ్చేనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం అఖిల భారత 22వ మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభల ప్రచారాన్ని రాష్ట్ర కమిటీ...

Saturday, March 24, 2018 - 17:07

రంగారెడ్డి : తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారమే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించిందన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం అఖిలభారత 22వ మహాసభలు జరుగనున్న నేపథ్యంలో భువనగిరిలో ఆయన...

Saturday, March 24, 2018 - 08:26

నల్లగొండ : జిల్లాలోని చండూర్‌ మండలం గట్టుప్పల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పరకాలను  డివిజన్‌గా ప్రకటించి.. గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించకపోవడంతో గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దహనం చేశారు. 500 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరసన తెలిపారు....

Wednesday, March 21, 2018 - 16:21

నల్లగొండ : 10టీవీ కథనంపై నల్లగొండ జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మిర్యాలగూడ ఎంఈవో చంప్లా నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. నెలల తరబడి పాఠశాలకు గైర్హాజరయినా.... ముడుపులు తీసుకుని ఉపాధ్యాయులకు హజరు వేస్తోన్న చంప్లా అవినీతి భాగోతాన్ని 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. 10టీవీ కథనానికి స్పందించిన జిల్లా డైట్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ విచారణ జరిపారు. ఏడాదిగా...

Pages

Don't Miss