నల్గొండ
Friday, October 13, 2017 - 08:16

 

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని గంగోత్రిలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థి నరహరి గల్లంతయ్యాడు. నరహరి మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ చెందినవాడు. నరహరి డెహ్రాడూన్ డీఎస్ బీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్ సీ చదువుతున్నాడు. విహారయాత్ర కోసం తోటి విద్యార్థులతో గంగోత్రికి వెళ్లిన నరహరి స్నానం చేయడానికి నదిలోకి దిగి గల్లంతయ్యాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Thursday, October 12, 2017 - 11:05

నల్లగొండ : కొత్తజిల్లాలతో తెలంగాణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని విద్యత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయిని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Tuesday, October 10, 2017 - 13:53

 

నల్లగొండ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో శిశువు మృతి చెందింది. డాక్టర్ శోభారాణి వల్లే తన శిశువు చనిపోయిందని బాధితులరాలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 9, 2017 - 19:43

 

నల్లగొండ : నాగార్జునసాగర్ లో ఎన్ఎస్పీ క్వార్టర్ కోసం గులాబీ తమ్ముళ్లు బాహబాహీకి దిగారు. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కేటాయించిన క్వార్టర్ లో మరో నేత బ్రహ్మరెడ్డి నివాసముంటున్నారు. క్వార్టర్ ను ఖాళీ చేయాలని బ్రహ్మారెడ్డి క్వార్టర్ కు కోటిరెడ్డి అనుచరులు వెళ్లారు. బ్రహ్మారెడ్డి ఖాళీ చేయబోమని ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది...

Monday, October 9, 2017 - 09:22

హైదరాబాద్ : కట్టుకోబోయే వాడే కాలయముడయ్యాడు. పెళ్లికి ముందే సూటిపోటి మాటలతో అనుమాన పిశాచిగా తయారయ్యాడు. నువ్వు తప్ప నా జీవితానికి మరో ఆప్షన్‌ లేదని ఆ యువతి ఎంతచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ తన నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. తన స్నేహితురాలు ఇక లేదని తెలియడంతో మరో ట్రెయినీ కానిస్టేబుల్‌ బలవంతంగా తనువు చాలించింది. రెండు కుటుంబాలను విషాదంలోకి...

Saturday, October 7, 2017 - 09:47

నల్లగొండ : జిల్లాలోని చండూరు బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ లింగస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. బస్టాండ్‌ ఆవరణలో లింగస్వామి చెట్టుకు ఉరేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది. లింగస్వామి స్వగ్రామం గుండ్లపల్లి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Friday, October 6, 2017 - 16:11

నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉంటున్నారని..వారి కోసం ఎంతో చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో తమ సమస్యలు తీర్చాలంటూ రైతులు ఆందోళనలు..నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర నష్టాలపాలైన రైతన్నలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరోక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
జిల్లా చిన కాపర్తిలో కౌలు రైతు ఆత్మహత్య తీవ్ర...

Thursday, October 5, 2017 - 21:22

నల్లగొండ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పర్యటించిన ఆయన కాళేశ్వరానికి స్టే ఇవ్వడం కాంగ్రెస్‌కు ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

Pages

Don't Miss