నల్గొండ
Tuesday, October 3, 2017 - 17:48

నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి సోదరులు అవాకులు, చవాకలు మాట్లాడుతున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించిన తనపై వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నారని సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tuesday, October 3, 2017 - 11:04

నల్గొండ : యాదాద్రి జిల్లాలో మూసీ నదికి వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున్న వస్తున్న వరదనీటితో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. వరదనీరు భారీగా రావడంతో మూసీలో నీటి మట్టం 644.8 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645గా అడుగులుగా ఉంది. గరిష్టస్థాయికి నీరు చేరడంతో మూడు ఫీట్ల మేర ఐదు గేట్లను ఎత్తివేశారు. దీనితో పోచంపల్లి, భీమనపల్లి తదితర గ్రామాల్లో రాకపోకలు...

Sunday, October 1, 2017 - 09:04

సూర్యాపేట : జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు-వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది....

Sunday, October 1, 2017 - 06:58

నల్గొండ : సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు- వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది....

Saturday, September 30, 2017 - 08:41

నల్గొండ : ప్రభుత్వ, అధికార యంత్రాంగం చట్టాలను తుంగలో తొక్కుతూ నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్. భూ నిర్వాసితులందరికీ భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చర్లగూడెం రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితుల ధర్నాలో కోదండరామ్ పాల్గొన్నారు. రైతులు కోరుతున్నట్లు ఎకరాకు రూ.15 లక్షల రూపాయలు నష్టపరిహారం...

Friday, September 29, 2017 - 19:20

నల్లగొండ : సూర్యాపేట జిల్లాల నుంచి సబ్సిడీ గొర్రెలను దళారులు తరలిస్తుండగా... వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 210 గొర్రెలు, 4 డీసీఎంలు, 2 బొలెరో వాహనాలు సీజ్‌ చేశారు. సబ్సిడీ గొర్రెలను విక్రయించిన వారితో పాటు.. కొన్న వారిపైనా చీటింగ్‌ కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, September 28, 2017 - 21:25

నల్లగొండ : పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి శని వదులుతుందని ఆయన అన్నారు. సుఖేందర్‌రెడ్డి పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఉప ఎన్నిక వస్తే...

Wednesday, September 27, 2017 - 08:51

నల్లగొండ : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటాయి. వాడవాడలా బతుకమ్మ ఆటపాటలతో పల్లెల్లో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రతీ రోజు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో జిల్లా పరిషత్ సీఈవో హనుమా నాయక్‌, స్త్రీ శిశు సంక్షేమ ఆర్గనైజర్ శరణ్యా రెడ్డి, ఎంపీపీ రజిత, డిప్యూటీ డైరెక్టర్‌ సంగీత...

Monday, September 25, 2017 - 18:22

నల్లగొండ : జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం వద్ద ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ఆకస్మికంగా పరిశీలించారు. సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్ట్‌ వద్దకు పరుగులు తీశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు హరీష్‌రావు. వచ్చే మూడు నెలల్లో టన్నెల్‌ పన్నులు పూర్తవుతాయని... డిసెంబర్‌లో ట్రయల్...

Monday, September 25, 2017 - 16:33

నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తొందరపడుతున్నామా.. అనే అలోచనతో గులాబీదళపతి సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో హస్తంపార్టీని తక్కువ అంచనా వేస్తున్నామా.. అనే ఆందోళన కారుగుర్తుపార్టీలో వస్తున్నట్టు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలో పాగావేయడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.

 ...

Pages

Don't Miss