నల్గొండ
Wednesday, January 6, 2016 - 22:03

నల్గొండ : ఉప్పల్‌-యాదాద్రి మెట్రో రైలు లైన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన మొదలైంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి బృందం, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ రాయగిరిలో స్థలాన్ని పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..యాదాద్రికి రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా...

Wednesday, January 6, 2016 - 17:29

నల్లగొండ : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి వృద్ధాప్యంలో కొడుకులకు భారమైంది.. కన్న పేగు బంధమనికూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేశారు ఇద్దరు సుపుత్రులు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది.. కూరగాయల మార్కెట్ సమీపంలో నివసించే ముదుకు పూలమ్మ వయసు 78 ఏళ్లు.. భర్త చనిపోవడంతో అతను సంపాదించిన ఇంట్లోనే ఉంటోంది.. ఈ ఆస్తిపై కన్నేసిన ఇద్దరు కొడుకులు... నకిలీ దృవపత్రాలతో ఆ ఇల్లు తమ పేరుమీద...

Wednesday, January 6, 2016 - 06:33

హైదరాబాద్ : టైమ్ టేబుల్ ఖరారైంది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్‌అయింది. తెలంగాణలో విద్యాక్యాలెండర్ విడుదలైంది. అర్హతా పరీక్షలకు సంబంధించిన తేదీలు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ నుంచి పీసెట్‌ వరకూ అన్ని ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలు సర్కార్‌ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సెట్ల తేదీలను ప్రకటించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 2న ఎంసెట్...

Saturday, January 2, 2016 - 15:43

నల్గొండ : విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుణ్ని నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర కారు ఢీకొట్టింది. మృతదేహం కారు టాప్‌పై పడినా కారు యాజమాని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. కారుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంబడించి కట్టంగూర్‌ మండలం ఐటిపాముల సమీపంలో పట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు యాజమానిని...

Friday, January 1, 2016 - 14:32

నల్గొండ :యాదాద్రి జిల్లా అయ్యే విధంగా కరుణించాలని కోరుతూ.. యాదగిరి నరసింహునికి టి.టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు వినతిపత్రం సమర్పించారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించేలా సీఎం కేసీఆర్‌కు సద్బుద్ధి ప్రకటించాలని నరసింహుని కోరినట్టు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Friday, January 1, 2016 - 11:48

నల్గొండ : భారతదేశాన్ని భారతమాతగా సంభోదిస్తాము. మాతృభూమిగా కొలుస్తాము. దేవతలను పూజిస్తాము. అన్నీ బాగానేవున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు, వివక్ష పోలేదు.. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకవైపు న్యూ ఇయిర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో మరోవైపు ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా...

Thursday, December 31, 2015 - 14:32

హైదరాబాద్ : యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలని టి.టిడిపి నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. గత కొంతకాలంగా యాదాద్రి జిల్లాగా ప్రకటించాలని మోత్కుపల్లి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై రేపు లక్ష్మీ నరసింహస్వామికి వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు. స్వామివారు కేసీఆర్‌ మనసు మార్చుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Wednesday, December 30, 2015 - 19:39

నల్గొండ : తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాల రిజల్ట్స్‌ వచ్చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను కలిగించిన స్థానమేదైనా ఉందంటే అది ఖచ్చితంగా నల్గొండ స్థానమే. బరిలో దిగిన ప్రధాన అభ్యర్థులు ఇద్దరూ ఆర్థికంగా హేమాహేమీలే. పార్టీల పరంగా మంచి పలుకుబడి ఉన్న క్యాండెట్లే. ఇద్దరికీ గెలుపు ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్సీ స్థానంపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి...

Wednesday, December 30, 2015 - 19:35

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్‌ దూకుడు కొనసాగింది. పోటీ చేసిన ఆరు స్థానాలకు గాను.. నాలుగింట ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మూడుస్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. రెండు చోట్ల గెలిచి పరువు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు.. ఈ ఫలితాలు ఓరుగల్లు ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించాయనే చెప్పాలి. ఇక టీడీపీకి ఈ ఎన్నికల్లోనూ దారుణ పరాభవం తప్పలేదు. మొత్తానికి షెడ్యూలు ప్రకారం 12...

Wednesday, December 30, 2015 - 19:11

హైదరాబాద్ : తెలంగాణలో సర్కారీ కొలువును చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడి చదువుతున్న అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) బుధవారం సాయంత్రం విడుదల చేసింది. కేవలం 439 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల నుండి కొంత అసంతృప్తులు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. వేలాది పోస్టులు...

Wednesday, December 30, 2015 - 16:26

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎన్ని కుయుక్తులు ప్రదర్శించినా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ సత్తాచాటిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Pages

Don't Miss