నల్గొండ
Tuesday, February 6, 2018 - 13:39

నల్గొండ : బీజేపీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో బీజేపీ నేతలు ఎన్నికల ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు పకోడీ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పన, ఉద్యోగాలు సృష్టించడంలో బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందిందని...

Tuesday, February 6, 2018 - 12:55

నల్గొండ : ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. నల్గొండలో జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయన సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఆనంతరం ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ఏపీలో ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, వర్గ పోరాటాల వల్ల ప్రజా పోరాటాలు ఊపందుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో...

Tuesday, February 6, 2018 - 09:39

నల్గొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. నేడు మూడో రోజు మహాసభలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ప్రతినిధుల సభ జరుగనుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు టెన్ టివితో మాట్లాడుతూ సీపీఎం పార్టీ పునాది పెరగాలన్నారు. పార్టీకి ప్రజా పునాది పెరగాలని కాంక్షించారు. బీఎల్ ఎఫ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.  వర్గ, సామాజిక ఉద్యమాలు...

Tuesday, February 6, 2018 - 08:43

నల్గొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యను కోమటిరెడ్డి సోదరులు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  విమర్శించారు. శ్రీనివాస్‌ సంస్మరణ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ హత్యను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Monday, February 5, 2018 - 19:55

నల్గొండ : బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ ప్రయత్నాలు ఏపీలో...

Monday, February 5, 2018 - 18:21

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌ సామాన్యులపై మరింత భారం మోపనుందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రెండు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం మరోవైపు సెస్సు రూపంలో 2 శాతం వడ్డిస్తోందని కరత్‌ విమర్శించారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం,...

Monday, February 5, 2018 - 17:59

నల్గొండ : ఇవాళ రెండో రోజూ.. సీపీఎం ద్వితీయ రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. అంశాల వారీగా పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో అన్ని రంగాల వారూ చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళావిభాగం.. రాష్ట్ర సమస్యలపై తమదైన అవగాహనను కనబరుస్తోంది. మహిళా సమస్యలకు పరిష్కారాలనూ మహిళా విభాగం నాయకులు ప్రతిపాదించారు. చర్చ సందర్భంగా.. మహిళా విభాగం ప్రతినిధులంతా.. వేదికపైకి వచ్చి.. సందడి చేశారు....

Monday, February 5, 2018 - 09:37

నల్లగొండ : నల్లగొండ ఎర్రగొండగా మారింది. సీపీఎం మహాసభలు నేడు రెండో రోజు కొనసాగున్నాయి. నేడు సభలో భవిష్యత్ ఉద్యమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

Monday, February 5, 2018 - 08:20

నల్లగొండ : నల్లగొండ పట్టణం ఎర్రగొండగా మారింది. ప్రధాన వీధులన్నీ అరుణవర్ణశోభితమయ్యాయి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం ఎరుపెక్కింది. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ
మహాసభల ప్రారంభసూచికగా నగరంలో సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. రెడ్‌...

Monday, February 5, 2018 - 08:16

నల్లగొండ : ఇటీవల దారుణ హత్యకు గురైన మున్సిపల్ చైర్‌ పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభ నల్గొండ పట్టణంలో జరిగింది. సభకు పార్టీ సీనియర్ నేతలతో పాటు... కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. శ్రీనివాస్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.బొడ్డుపల్లి శ్రీనివాస్‌ది ముమ్మాటికి టీఆర్‌ఎస్‌ నాయకులు చేయించిన హత్యేనని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి...

Sunday, February 4, 2018 - 22:00

నల్గొండ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని లెఫ్ట్‌ నేతలు స్పష్టం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా వామపక్షపార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు నల్లగొండలో ఘనంగా మొదలయ్యాయి. అన్ని వామపక్ష పార్టీలతో కలిసి విశాల ఐక్య ఉద్యమాలు నిర్మించనున్నట్టు సమావేశంలో సీపీఎం నాయకులు తెలిపారు.
సీపీఎం మహాసభలు ఘనంగా...

Pages

Don't Miss