నల్గొండ
Wednesday, October 7, 2015 - 16:13

నల్గొండ : రహదారులు రక్తసిక్తమయ్యాయి. రోడ్డు నెత్తురోడింది. నిర్లక్ష్యం మరోమారు భారీ మూల్యం చెల్లించింది. రవాణా భద్రత డొల్లతనం 10 మంది ప్రాణాల సాక్షిగా బయటపడింది. రోడ్డెక్కితే తిరిగొచ్చే గ్యారంటీ లేదని మరోసారి రుజువైంది. ఈ ప్రయాణం తమ పాలిట మృత్యుప్రయాణం అవుతుందని తెలియని సామాన్యులు నడిరోడ్డు మీదే తమ ప్రాణాలను వదిలేశారు. గమ్యం చేరడానికి బస్సెక్కిన ప్రయాణీకులు.. ప్రమాదం తమ...

Friday, October 2, 2015 - 19:24

హైదరాబాద్ : నల్గొండ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చింతపల్లి మండలం కూర్మేడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. 

Friday, October 2, 2015 - 16:59

నల్లగొండ : మిర్యాలగూడ పీఎస్‌ ఎదుట గిరిజన మహిళ మిర్యాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని కొందరు కబ్జా చేయడంతో పాటు.. రిలయన్స్‌ టవర్‌ ఏర్పాటు చేసుకునేందుకు లీజుకు కూడా ఇచ్చారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా... తనపైనే తిరిగి కేసు పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన మహిళ...

Friday, October 2, 2015 - 15:18

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా భువనగిరిలో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మర్యాలలో కిడ్నాపైన ధీరావత్ సుమన్ దొరికాడు. తనను దుండగులు కిడ్నాపర్లు తీసుకెళ్లారని సుమన్ తెలిపాడు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ... తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారని సుమన్ చెప్పాడు.

Friday, October 2, 2015 - 13:50

నల్లగొండ : జిల్లాలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇందులో ఒక మహిళారైతు కూడా ఉన్నారు.. చందంపేట మండలం నేరేడుగొమ్ముకుచెందిన శ్రీను తన ఐదెకరాల పొలంలో పత్తివేశారు . ఈ పంటకు తెగులు రావడంతో వ్యవసాయం వదిలి కరీంనగర్‌ జిల్లాకు వలసపోయారు.. పంటకోసం అప్పులిచ్చినవారు వేధించడంతో పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.. దేవరకొండ మండలం...

Thursday, October 1, 2015 - 12:24

నల్గొండ : జిల్లాలో సుమన్ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంగళవారం సాయంత్రం అపహరణకు గురైన ఆరేళ్ల విద్యార్థి ఆచూకి తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం బాలుడు కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. బొమ్మలరామారం మండలం నాయకుని తండాకు చెందిన ధీరావతు సుమన్ తన ఇద్దరు స్నేహితులతో వస్తున్నాడు. వచ్చిన కారును లిఫ్ట్ అడిగారు. అనంతరం కారులో వారు ముగ్గురూ ఎక్కారు. గ్రామంలో...

Saturday, September 26, 2015 - 13:17

కర్నూలు/నల్గొండ : తొమ్మిది రోజులు ఘనంగా పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. కర్నూలు నగర పురవీధులలో తిరుగుతూ వినాయకఘాట్‌కు విగ్రహాలను నిమజ్జనాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

నల్గొండలో..
నల్లగొండ జిల్లాలో గణేష్‌ నిమజ్జన వేడుకలు ఘనంగా...

Thursday, September 24, 2015 - 21:09

నల్గొండ : ప్రాణంతో సరితూగే ఒకే ఒక బంధం స్నేహ బంధం. లోకంలో ఎన్ని బంధాలున్న స్నేహ బంధాన్ని మించిన బంధం మరొకటి లేదు. ప్రాణ స్నేహితుడు అన్నపదమే ఇందుకు నిదర్శనం. ప్రాణానికి ప్రాణమైన తన ప్రాణస్నేహితుడు లోకంలో లేడని తెలిసి మరో స్నేహితుడి గుండె ఆగిపోయింది. మానవ సంబంధాలను తట్టి లేపే ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
అపూర్వ స్నేహితుల బంధం
నల్గొండ...

Wednesday, September 23, 2015 - 15:33

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పుల బాధ భరించలేక..పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. బుధవారం పలు జిల్లాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రంగారెడ్డి..
రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్షాలు...

Wednesday, September 23, 2015 - 13:39

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాఓ ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జెల్లా కుమారస్వామి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం తట్టుకోలేక కుమారస్వామి సూసైడ్‌ చేసుకున్నాడు. కుమారస్వామి ఆత్మహత్యతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత...

Wednesday, September 23, 2015 - 12:46

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌.. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.15000 లు ఇవ్వాలని, సెకండ్ ఏఎన్ ఎంగా గుర్తించాలని సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా ఆశా వర్కర్లు ఆశలు వదులుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో కడుపు మండిన ఆశా వర్కర్లు హైదరాబాద్‌...

Pages

Don't Miss