నల్గొండ
Tuesday, September 22, 2015 - 09:33

నల్గొండ :అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలోని సుందరయ్యనగర్‌లో చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన స్థానిక మహిళలకు చెట్ల పొదల్లో ఉన్న ఆడ శిశువు ఏడుపు వినిపించింది. దీంతో వారు అక్కడకు వెళ్లి చూడగా..పాపను చీమలు, పురుగులు పట్టి ఉండడంతో వెంటనే వారు 108 కు ఫోన్‌ చేశారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది...

Saturday, September 19, 2015 - 16:04

నల్గొండ : మరో మహాలక్ష్మి చనిపోయింది. ఓ ఇంటి ఆశాదీపం ఆరిపోయింది. మరో విద్యార్ధిని భరోసా కోల్పోయింది. మార్కులు రాలేదని.. పరీక్ష తప్పినందుకే ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులను తీరని శోకంలో ముంచేసింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం కడపర్తిలో బీటెక్‌ విద్యార్ధిని భారతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష తప్పినందుకే చనిపోతున్నట్లు లేఖ రాసి.. చనిపోయింది.  ఆమె రామోజీ ఫిల్మ్ సిటీ...

Saturday, September 19, 2015 - 13:36

నల్లగొండ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కీచకుల్లా మారిపోతున్నారు. తాజాగా ఓ వ్యాయామ టీచర్ విద్యార్థినిలను లైంగికంగా వేధించాడు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న మల్లయ్య అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు ...

Friday, September 18, 2015 - 12:04

నల్గొండ : ఎస్సై రమేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రమేష్ అంతిమక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని స్థానికులు అంతిమయాత్రను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

Friday, September 18, 2015 - 09:38

నల్గొండ : ఎస్సై రమేష్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లాలోని చెరుపల్లి షేర్ పల్లి తండాకు చేరుకుంది. ఇవాళా దేవరకొండలో రమేష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రెండు రోజుల రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రమేష్ మృతితో ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. కన్నీటిపర్యంతమయ్యారు. గుండెలవిసేలా విలపిస్తున్నారు. గ్రామంలో...

Thursday, September 17, 2015 - 16:40

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో ఇద్దరు అన్నదాతలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో పురుగులమందు తాగి ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం చేయూత అందించకపోవడం, పెరిగిన అప్పులే తన భర్త ప్రాణం తీశాయని భార్య కన్నీరుమున్నీరవుతోంది.

Wednesday, September 16, 2015 - 15:18

హైదరాబాద్ : నల్గొండ జిల్లాను కరువు జిల్లా ప్రకటించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు రూ5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ...

Tuesday, September 15, 2015 - 15:43

నల్గొండ : జిల్లా తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఇటియోస్‌ కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణీకులు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టోల్ గేట్ తరువాత నార్కెట్ పల్లి - అద్దంకి రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో ఛిద్రమైంది. ఆటోలో ఉన్న నలుగురు స్పాట్ లో చనిపోయారు. మరో ఆరుగురని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి...

Monday, September 14, 2015 - 17:06

హైదరాబాద్ : గుర్రంపోడు మండలం ఆములూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో.. ముగ్గురు చనిపోయారు. మృతులు నాగర్‌కర్నూలు, నల్గొండ వాసులుగా గుర్తించారు. వారి పేర్లు సైదులు, శంకరమ్మ, రాజూగౌడ్‌లుగా చెబుతున్నారు.నాగర్ కర్నూల్ నుండి నల్గొండ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Monday, September 14, 2015 - 15:51

నల్గొండ : దామరచర్ల మండలం లావురితండాలో లావూరి రఘు అనే గిరిజన రైతు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. తెల్లవారు జామున పొలానికి నీళ్ళు పెట్టాలని వెళ్లిన రఘు.. విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గతేడాది రఘు సోదరుడు శంకర్‌ కూడా ఇలానే కరెంట్‌ షాక్‌తో చనిపోయాడు. యేడాది వ్యవధిలోనే ఒకే కుటుంబంలో పెద్ద దిక్కు...

Saturday, September 12, 2015 - 18:36

నల్లగొండ : జిల్లాలో మరో సూదిదాడి కలకలం సృష్టించింది. తనను ఇద్దరు దుండగులు సూదితో పొడిచారంటూ నరసింహరావు అనే వ్యక్తి హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. మేళ్లచెర్వు మండలం దొండపాడు సమీపంలోని రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర తనపై దాడి జరిగిందని చెబుతున్నాడు. అయితే వైద్యులు మాత్రం సూది దాడిని ఇంకా నిర్ధారించలేదు. 

Pages

Don't Miss