నల్గొండ
Saturday, July 18, 2015 - 13:28

నల్గొండ : జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని టోల్‌ ప్లాజాలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో హైదరాబాద్‌ నుంచి భద్రాచలం పుష్కరాలకు వెళ్తున్న బస్సులు, వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. భద్రాచలంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సుమారు 2 గంటల పాటు...

Friday, July 17, 2015 - 21:28

నల్లగొండ: మిర్యాలగూడలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో భారీ దోపిడి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి 14 తులాల బంగారం, లక్షా 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లిపోయారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో నాగమణి అనే మహిళా నివాసముంటోంది. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తన పుట్టింటికి వెళ్లింది. ఇవాళ ఇంటికి తిరిగొచ్చేసరికి ఇళ్లంతా దోపిడికి గురయింది....

Friday, July 17, 2015 - 15:09

నల్గొండ: వామపక్షాల మద్దతుతో నల్గొండ జిల్లాలో ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులు, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భువనగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులపై లాఠీఛార్జ్ చేయడంతో అనేకమందికి గాయాలయ్యాయి. పోలీసుల అక్రమ అరెస్టులను లెఫ్ట్ నేతలు ఖండించారు. అప్రజాస్వామికంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్...

Thursday, July 16, 2015 - 16:50

నల్గొండ: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. స్కూల్‌ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని టాలెంట్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను చితకబాదారు. చదువు చెప్పాల్సింది పోయి...

Sunday, July 12, 2015 - 19:03

నల్గొండ: జిల్లాలో నకిలీ నోట్ల దందా వెలుగుచూసింది. భువనగిరి కేంద్రంగా ఈ దందా సాగుతోంది. రూ.10వేలు ఇస్తే... 20వేల రూపాయల విలువైన నకిలీ నోట్లు అందిస్తున్నారు. లక్ష రూపాయలు ఇచ్చిన వారికి...3లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నట్టుగా తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. 

Tuesday, July 7, 2015 - 20:38

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడల్లో సీఐటీయూ బస్‌ జాత నిర్వహించారు. వీరికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, ఈఎఫ్‌, పీఎఫ్‌లు చెల్లించాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతర పోరాటం చేస్తోందని కార్మిక నేతలు అన్నారు. వెంటనే కార్మికులకు కనీస వేతనం 15వేల రూపాయలు అమలు చేయాలన్నారు...

Monday, July 6, 2015 - 09:31

నల్గొండ: డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు రెండు లక్షల విలువైన పేపర్‌ బండిల్స్‌ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెం మండలం దురాజ్‌పల్లి దగ్గర జరిగింది. చిల్లకల్లు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్‌ బండిల్స్‌ మొత్తం కాలి బూడిదయ్యాయి. ఇంజన్‌ వేడెక్కి మంటలు ఎగిసిపడ్డాయని వాహన డ్రైవర్‌ అంటున్నారు.

Sunday, July 5, 2015 - 18:25

నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శూన్యపహాడ్‌లో రామాచారి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఉదయం పూట రామాచారి ఇంటికి వచ్చిన దుండగులు తలుపులు బాదారు. తలుపులు ఎంతకూ తీయకపోవడంతో కిటికీలు ద్వంసం చేసి ఇంట్లోకి చొరబడి రామాచారిని గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది.

 

Sunday, July 5, 2015 - 12:28

నల్గొండ : భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సన్నిధికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రణబ్ కు అర్చకులు ఆశీర్వదించారు. ప్రణబ్...

Sunday, July 5, 2015 - 06:12

నల్గొండ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని నేడు సందర్శించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ రాకకోసం అధికార యంత్రాంగం, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేసింది. యాదగిరిగుట్టను తొలిసారిగా సందర్శించనున్న రాష్ట్రపతి దాదాపు గంటపాటు లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపనున్నారు.
ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి..
తెలంగాణ...

Saturday, July 4, 2015 - 21:33

నల్లగొండ: జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం... గ్రామపంచాయతీ ఉప ఎన్నిక ఫలితం విడులైంది. ఈ ఎన్నికలో సీపీఎం అభ్యర్థి జూలకంటి కొండారెడ్డి విజయం సాధించారు. ఇంతకుముందు సర్పంచ్‌గా ఉన్న పురంధర్‌రెడ్డి....హత్యకు గురికావటంతో ఉప ఎన్నికను నిర్వహించారు. గ్రామంలో మళ్లీ సీపీఎం అభర్థే గెలవటంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు....

Pages

Don't Miss