నెల్లూరు
Sunday, February 19, 2017 - 12:36

నెల్లూరు : మాగుంట లే అవుట్ లో విషాదం చోటు చేసుకుంది. సమాచార హక్కు జిల్లా కన్వీనర్ భద్రం మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. రెడ్ క్రాస్ లో క్రీయాశీల పాత్ర పోషిస్తున్నాడు. సీపీఐ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. భద్రం ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తుండడంతో ప్రత్యర్థులు కక్ష కట్టి చంపేసి మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి...

Sunday, February 19, 2017 - 12:07

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక సంస్థల కోటాలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల కావడంతో టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న నేతలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతుంటే, తమకు ఓ అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. చిత్తూరు, అనంతపురం...

Saturday, February 18, 2017 - 17:47

నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రాజకీయాలు చేయలేదని, ఎన్నికల్లో డబ్బులు పంచడం లేదని చెప్పగలరా అని నిలదీశారు. ప్రధాని మోడీ ఏపీకి ఇచ్చిన హామీలకు గతి లేదు కానీ యూపీలో రైతు రుణమాఫీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Saturday, February 18, 2017 - 17:39

నెల్లూరు : తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో ఎలాంటి విబేధాలు లేవని టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తుది శ్వాస వరకు నెల్లూరును..రాజకీయాలను..తమ్ముడిని వదులుకోనని ఖరాఖండిగా చెప్పారు.

Friday, February 17, 2017 - 22:04

నెల్లూరు : జీజీహెచ్‌లో విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు క్లీనిక్‌ నడుపుతున్న ఆరుగురు డాక్టర్లను మంత్రి కామినేని సస్పెండ్‌ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన.. విధులకు హజరుకాకుండా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు హస్పటల్స్‌ ఉంటే రాజీనామా చేయాలని కామినేని అన్నారు. వారి స్థానంలో...

Friday, February 17, 2017 - 20:11

నెల్లూరు : 20 ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయారు...వివిధ హోదాల్లో పనిచేశారు...పదోన్నతులు వచ్చినకొద్దీ అధికారం పెరిగింది..అందులో ధనదాహం కూడా...సింహపురిలో ఉన్నతాధికారిగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన రాంరెడ్డి అక్రమ సంపాదన బయపడింది...ఏసీబీ తవ్వినకొద్దీ బయటపడుతున్న వాటిని చూసి కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నాడు..తనకున్న పరిచయాలను క్యాష్...

Friday, February 17, 2017 - 11:53

నెల్లూరు : జిల్లా పరిషత్‌ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో ఏకకాలంలో దాడులు చేశారు. నెల్లూరు సహా మొత్తం 15 చోట్ల రామిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల...

Thursday, February 16, 2017 - 20:06

నెల్లూరు : జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు పనిచేయని ప్రభుత్వ డాక్టర్లపై కొరఢా ఝళిపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ..పనిచేయకుండా డుమ్మాలు కొట్టే ప్రభుత్వ డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ డాక్టర్లుగా ఉంటూ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న,.ఆరుగురు డాక్టర్లఫై  జిల్లా కలెక్టర్ ముత్యాల సస్పెండ్‌ వేటు వేశారు. డ్యూటీ టైంలో కూడా ప్రైవేట్ క్లినిక్ విధులు...

Wednesday, February 15, 2017 - 17:09

నెల్లూరు : గగనతంలో ఇస్రో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. పీఎస్‌ఎల్‌వీ -సీ37 విజయంతో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఇదే ఊపుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలపై 10టీవీ కథనం...
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త రికార్డు
ఇస్రో అంతరిక్షంలో...

Pages

Don't Miss