నెల్లూరు
Tuesday, November 14, 2017 - 13:56

నెల్లూరు : బోటు ప్రమాదంలో మృతి చెందిన లలితమ్మ, హరిత, అశ్విక మృతదేహాలు జిల్లాలోని వారి స్వగ్రామం కురుగొండకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. వీరి మృతితో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులతోపాటు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇవాళ సాయంత్రం మృతదేహాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ దగ్గరుండి...

Sunday, November 12, 2017 - 08:42

చిత్తూరు : తిరుపతి ఆర్టీసీ బస్టాండులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై..రక్షించాలంటూ బస్టాండులో పరుగులు తీశాడు. తీవ్రమైన రక్తపుస్రావంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రసూల్ కాళహస్తి బస్టాండు వద్ద ఆదివారం ఉదయం వేచి ఉన్నాడు. ఇతను టైలర్ అని తెలుస్తోంది. ఇతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో...

Friday, November 10, 2017 - 08:34

నెల్లూరు : కువైట్‌లో యజమాని చేతిలో చిత్రహింసలు పడుతున్న నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి తన ఇంటికి చేరుకున్నాడు. తాను చిత్రహింసలు పడుతున్న విషయాన్ని రవి వీడియో ద్వారా తెలుపగా టెన్‌ టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో కువైట్లో ఉన్న అనేక మంది భారతీయులు స్పందించి రవిని ఇండియాకు సేఫ్‌గా పంపించారు. ప్రస్తుతం రవి తన స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి...

Tuesday, November 7, 2017 - 16:01

నెల్లూరు : జిల్లాలోని కావలిలో ఇద్దరు పోలీసు అధికారులు స్టేషన్‌లోనే వీరంగం సృష్టించారు. ఒకరితో ఒకరు  ఘర్షణకు దిగి.. రోడ్డునపడ్డారు. ఓ ఫ్యాన్సీ స్టోర్‌ వివాదంలో.. సీఐ, ఏఎస్ ఐల మధ్య పంపకాలు దగ్గర తేడా వచ్చి.. పోలీస్‌స్టేషన్‌లోనే గొడవపడ్డారు. సోమవారం రాత్రి ఏఎస్ ఐ సుబ్రహ్మణ్యం స్టేషన్‌లో.. సీఐ రోశయ్యతో వాగ్వాదానికి దిగడంతో.. అక్కడే ఉన్న ఎస్ ఐ అంకమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఎస్...

Tuesday, November 7, 2017 - 11:55

నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకేంద్రంలో

డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి . భూగర్భ డ్రైనేజీ , వాటర్ పైప్లైన్ల కోసం మొత్తం రోడ్లన్నీ తవ్వేసి ఉండడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . ఆత్మకూరు బస్టాండ్ ,ముత్తుకూరు బస్టాండ్ వద్దనున్న అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Saturday, November 4, 2017 - 18:27

నెల్లూరు : జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆదేశించారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరాలు, సీజనల్ వ్యాధులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు తగ్గేవరకు డాక్టర్లు సెలవును రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్యూటీ సమయంలో చాలా చోట్ల డాక్టర్లు ఆస్పత్రుల్లో ఉండటం లేదన్న ఆరోపణలు...

Friday, November 3, 2017 - 18:38

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల...

Pages

Don't Miss