నెల్లూరు
Wednesday, November 1, 2017 - 16:20
Tuesday, October 31, 2017 - 19:56

నెల్లూరు : పేషంట్‌ కడుపులో కత్తెర ఉంచి కుట్లేసిన నెల్లూరు ప్రభుత్వాసపత్రి వైద్యుల నిర్వాకంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్‌ రాధాకృష్ణరాజు వెల్లడించారు. మరోపక్క ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమంటూ వెంటనే తన భర్తకు సర్జరీ చేశారని బాధుతుని భార్య వాపోయింది. 

Monday, October 30, 2017 - 19:20

 నెల్లూరు : విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకునేందుకు ఐఐటీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులోని మున్సిపల్ రెసిడెన్షియల్‌ కళాశాలను మంత్రి సందర్శించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలో ఫౌండేషన్‌ ప్రారంభించినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌ ఐఐటీ హబ్‌గా మారిందని మంత్రి తెలిపారు. పేద విద్యార్థుల్లో స్పూర్తి, పోటీతత్వాన్ని పెంచి వారి జీవితంలో...

Monday, October 30, 2017 - 16:55

నెల్లూరు : ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చలపతిరావు అనే రోగికి ఆపరేషన్‌ చేసి కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారు వైద్యురాలు పద్మశ్రీ. వారం రోజులుగా కడుపునొప్పితో బాధపడిన చలపతిరావు.. మళ్లీ ఆస్పత్రికి వెళ్తే విషయాన్ని గోప్యంగా ఉంచి రెండవసారి ఆపరేషన్‌ చేశారు. డాక్టర్‌ పద్మశ్రీ గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేయారనే ఆరోపణలు ఉన్నాయి. 

 

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Friday, October 20, 2017 - 20:06

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నేరాలు పెరిగిపోతున్నాయి..డిపార్ట్‌మెంట్లో ఉంటూ...అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నవారు పెరిగిపోయారు..బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నవారే కీచకులుగా మారుతున్నారు...బాధితురాళ్లు స్టేషన్‌ వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు కోర్కెలు తీర్చాలంటూ వేధిస్తున్నారు..వెంటపడుతున్నారు...కామపిశాచాలుగా మారిన రెండు రాష్ట్రాల్లోని ఓ సీఐ,ఓ ఎస్సైలపై...

Friday, October 20, 2017 - 15:31

నెల్లూరు : జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు లైంగిక వేధింపులపై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. మహిళా సర్పంచ్ ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలున్నాయి. తనతో అసభ్యకరంగా మాట్లాడాడని..అత్యాచారయత్నం చేశాడని ఊటుకూరు మహిళా సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యులపై కేసులు బనాయిస్తానని ఏడుకొండలు బెదిరిస్తున్నాడని ఆ మహిళా సర్పంచ్ వాపోయింది. దీనితో ఆయన్ను...

Thursday, October 19, 2017 - 16:08

నెల్లూరు : నిన్న నిజామాబాద్ జిల్లా భోదన్ సీఐ సురేందర్ రెడ్డి కీచక పర్వం మరవక ముందే ఈ రోజు నెల్లూరు జిల్లా మరో ఎస్సై కీచక పర్వం బయటపడింది. ఎస్సై ఎడుకొండలు ఓ మహిళా సర్పంచ్ ను లైగింకంగా వేధిస్తున్నాడు. మహిళతో ఎస్సై అసభ్యంగా మాట్లాడుతుండడంతో పాటు కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరింపులు గురిచేయండంతో ఆ మహిళ పోలీస్ ఉన్నధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం...

Pages

Don't Miss