నెల్లూరు
Friday, October 13, 2017 - 20:45

నెల్లూరు : హైకోర్టు ఆదేశాలతో అధికారులు అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో బాధితులు తరలివచ్చారు. అయితే... గతంలో వివరాలన్నీ ఆన్‌లైన్‌ చేసినా... మళ్లీ డాక్యుమెంట్స్‌ అడగడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

Tuesday, October 10, 2017 - 07:28

నెల్లూరు : న్యూటాక్స్‌ హాలు దగ్గర చెత్త ఏరుకునే వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఓ గ్రూప్‌కు చెందినవారు... మరో గ్రూప్‌కు చెందిన ముగ్గురి గొంతులను కత్తితో కోశారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

Monday, October 9, 2017 - 14:03

నెల్లూరు : సింహపురి వర్సిటీలో బిల్డింగ్‌పైకి ఎక్కిన విద్యార్థి గంగిరెడ్డి హల్‌చల్‌ చేస్తున్నాడు. తనకు వర్సిటీలో చదువుకునే అవకాశం కల్పించకుంటే కిందికి దూకేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు.  దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందోనని మిగతా విద్యార్థులు అంతా ఆందోళన పడుతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణానికి విద్యార్థి సంఘాలు చేరుకుంటున్నాయి. పోలీసులు పరిస్థితిని...

Friday, October 6, 2017 - 15:30

ఏలూరు : ఎంపీ మాగంటి బాబు..ప్రస్తుతం ఈయన వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఎవరైనా మందు తాగండి..పేకాట ఆడండి..పోలీసులు పట్టుకోవద్దంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగంటి బాబు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆర్యవైశ్యుల...

Friday, October 6, 2017 - 10:23

నెల్లూరు : మత సామరస్యానికి ప్రతికగా నిలిచే నెల్లూరు బారాషాహిద్‌ రొట్టెల పండగ ఘనంగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పండుగలో దాదాపు 7 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్‌ అధికారులను మంత్రి నారాయణ సత్కరించారు. ఈ పండగలో ఐదుగురు మంత్రులతో పాటు... పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

...
Friday, October 6, 2017 - 07:27

నెల్లూరు : బారా షాహిద్ దర్గాలను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ చివరిరోజు ఆమె పాల్గొన్నారు. రొట్టెల పండుగకు రావడం ఇదే మొదటిసారన్న అఖిలప్రియ బారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. 

 

Thursday, October 5, 2017 - 09:37

నెల్లూరు : జిల్లా కేంద్రంలో జరుగుతున్న రొట్టెల పండుగకి ప్రముఖ సినీ నటుడు అలీ సందర్శించాడు. బారాషహీద్‌ దర్గాని సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రొట్టెను పట్టుకున్నారు. తన సినీ కెరీర్ మొదలై 40 సంవత్సరాలు పూర్తయ్యిందని..  తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పదేళ్లయిందని పేద నటులకు, పేద...

Thursday, October 5, 2017 - 09:31

నెల్లూరు : దేశానికి వెన్నుముకగాఉన్న రైతు అభివృద్ధికి, పురోగతికి అవసరం అయిన పరిశోధనలు జరగాలని, వాటి ఫలితాలు రైతులకు చేరాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులోని కస్తూర్భా కళాక్షేత్రంలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయంలో డిగ్రీలు పొందిన విద్యార్థులు రైతులకు సేవలు అందించాలని సూచించారు. దేశం వ్యవసాయంతో ముడిపడివుందని, దేశ...

Wednesday, October 4, 2017 - 18:56

నెల్లూరు : నాల్గవ రోజు రొట్టెల పండుగలో భాగంగా ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అమర్నాథ్‌, మంత్రి నారాయణ నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాను సందర్శించారు. కులమతాలకు అతీతంగా కోరికలు పంచుకునే రొట్టెల పండుగ చాలా ప్రశస్తమైందని మంత్రి అమర్నాథ్‌ రెడ్డి అన్నారు. ఏపీలో యువకులకు ఉద్యోగాలు రావాలని రొట్టె తీసుకోవడం జరిగిందిన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని రొట్టెను...

Pages

Don't Miss