నెల్లూరు
Thursday, February 8, 2018 - 15:08

విజయవాడ : బంద్‌ నేపథ్యంలో ఏపీలో జనజీవన వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నాయి. ఉదయం నుంచి వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. మరోవైపు కేంద్ర వైఖరిని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు....

Thursday, February 8, 2018 - 08:02

నెల్లూరు : జిల్లాలో వామపక్షాల బంద్‌ ప్రారంభమైంది. కావలిలో ఆర్టీసీ డిపో వద్ద బస్సులు బయటకురాకుండా సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్ని చోట్ల భారీగా పోలీసులను మోహరించారు. 
 

Monday, February 5, 2018 - 20:10

నెల్లూరు : రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గౌహతీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ ప్రయాణీకుడి నుంచి సుమారు నాలుగు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటీ 43 లక్షలు దాకా ఉంటుందని అధికారుల అంచనా. ఎలక్ర్టిక్‌ స్టవ్‌లో బంగారు అమర్చి... అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్1962 ప్రకారం కేసునమోదు చేసినట్లు డీఆర్‌ఐ...

Friday, February 2, 2018 - 16:24

నెల్లూరు : జిల్లా లో భర్త భార్యపై యాసిడ్ దాడి చేశాడు. కరిముల్లా, షబానాల మధ్య గతకొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Monday, January 29, 2018 - 21:18

నెల్లూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఇందుకోసం 74రోజుల సమయం తీసుకున్నారు. వేయి కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Thursday, January 25, 2018 - 07:25

నెల్లూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు వద్ద హైవేపై ముందు వెళ్తున్న లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు....

Monday, January 22, 2018 - 06:38

నెల్లూరు: బంధాలకు విలువే లేకుండాపోతుంది. కనీ పెంచిన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లలు బరువుగా భావిస్తున్నారు. దీంతో జీవిత చరమాంకంలో ఏ తోడూ లేక రోడ్డున పడుతున్నారు. సొంత ఇంట్లోనే కన్నుమూయాలన్న తన చివరి కోరికను సైతం పట్టించుకోకుండా తల్లిని బయటకు గెంటేశాడో ప్రబుద్దుడు. పెద్దావిడ పేరు కృష్ణవేణమ్మ. ఇన్నాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్న ఈమె.. పండుగ పూట చూసేందుకు కన్న కొడుకు...

Friday, January 19, 2018 - 16:02

నెల్లూరు : జిల్లాలో దళితులపై కుల వివక్ష బయటపడింది. అగ్రవర్ణ పెద్దలు దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దళితులపై అగ్రవర్ణాలవారు దాడులకు తెగపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ విషయంపై దళితులు ఏఎస్పీని కలిశారు. మరింత సమచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss