నెల్లూరు
Wednesday, April 25, 2018 - 15:48

నెల్లూరు : టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరులోని ఆయన స్వగృహానికి కార్యకర్తలు, రాజకీయ నాయకులు చేరుకున్నారు. ఆనం వివేకానంద లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆనం నివాసం వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

Wednesday, April 25, 2018 - 10:20

హైదరాబాద్ : ఆయనదో విలక్షణమైన వ్యక్తిత్వం...మాటతీరు అంతే...వేషధారణతో ఇట్టే ఆకట్టుకుంటారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆయనే 'ఆనం వివేకానందరెడ్డి'. నెల్లూరు జిల్లా సొగ్గాడుగా పేరొందిన 'ఆనం వివేకానందరెడ్డి' కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి...

Tuesday, April 24, 2018 - 18:54

నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించే వారిని చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. బీజేపీ కొన్నాళ్లు కొనసాగితే ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ మాస్టర్‌ ఆఫ్ డిస్ట్రాయింగ్‌ ఇండియాగా అభివర్ణించారు. కర్నాటక ఎన్నికల కారణంగా బీజేపీ ఏపీలోని ఏటియంలలో...

Tuesday, April 24, 2018 - 17:42

నెల్లూరు : సిటీ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సైకిల్ యాత్రలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విభజన హామీల అమలు విషయంలో కుట్రలను ఎండగట్టి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, బీజేపీ మానిఫెస్ట్‌లో పెట్టిన అంశాలు, విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన...

Tuesday, April 24, 2018 - 17:40

నెల్లూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై సర్వేపల్లి వైసీపీ MLA కాకాని గోవర్దన్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సోమిరెడ్డి తన ధన దాహానికి నెల్లూరు జిల్లాలోని విలువైన ప్రకృతి సిద్ధమైన అటవీ సంపదను దోచుకుంనేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని మండిపడ్డారు. రెండు వేల రెండు వందల ఎకరాల విలువైన సిలికా భూములను కాజేసేందుకు కేంద్రానికి...

Sunday, April 22, 2018 - 22:13

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. మంత్రి నారాయణ రెండో రోజు సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు. నెల్లూరులోని మైపాడు గేటు సెంటర్ నుంచి మొదలైన సైకిల్‌ యాత్ర మూడు, నాలుగు, ఐదో వార్డుల గుండా సత్యనారాయణపురం దాకా సాగింది. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి...

Saturday, April 21, 2018 - 21:13

విజయవాడ : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నిరసనలకు దిగారు. బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధంచేశారు. గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ...

Saturday, April 21, 2018 - 14:34

నెల్లూరు : బీజేపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ధర్మ పోరాట దీక్షలో ప్రధాన మంత్రిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద బీజేపీ నాయకులు బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలను చితకబాదారు. ఈ గొడవలో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

Monday, April 16, 2018 - 18:12

నెల్లూరు : ప్రత్యేక హోదా కోరుతూ తలపెట్టిన బంద్‌ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, పలు ప్రజాసంఘాలు బంద్ పాటించి  వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నాయి. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే  పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Monday, April 16, 2018 - 10:56

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు....

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Pages

Don't Miss