నెల్లూరు
Tuesday, July 11, 2017 - 15:33

నెల్లూరు : కువైట్ లో నిర్భంధంలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన రవి విషయాన్ని టెన్ టివిలో ప్రసారం చేసిన వరుస కథనాలకు జిల్లాలోని నాయకులు స్పందించారు. కువైట్ లో ఉన్న ఫ్రెడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ రవితో మాట్లాడారు. రవిని ఇండియాకు తీసుకొస్తామని ఆయన తెలపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Tuesday, July 11, 2017 - 13:00

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరులో న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటానికి దిగారు. కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొని.. తమ కుమారులు వారిని ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో న్యాయం చేయాలంటూ వృద్ధ దంపతులు మౌనదీక్ష చేపట్టారు. 

 

Monday, July 10, 2017 - 19:09

నెల్లూరు : కువైట్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడు నానా కష్టాలు పడుతున్నాడు. 5 రోజుల నుంచి ఆ యువకుడిని తను పనిచేసే యజమాని ఓ రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తినడానికి తిండిగానీ.. తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి 2011లో కువైట్‌కు వెళ్లాడు. అక్కడ రుమితియా అనే షేట్‌ వద్ద కారుడ్రైవర్‌గా చేరాడు. 2016లో అక్కడి నుంచి తిరిగి భారత్‌...

Monday, July 10, 2017 - 16:26

నెల్లూరు : మరో భారతీయుడి కువైట్ లో నిర్భంధించారు. నెల్లూరు చెందిన ఓ యువకున్ని కువైట్ నిర్భంధించారు. నెల్లూరు జిల్లాకు చెందిన రవి కారుడ్రైవర్ ఉద్యోగానికి కువైట్ కు వెళ్లారు. యజమాని రవిని ఐదు రోజులుగా ఆహారం, నీరు ఇవ్వకుండా స్టోర్ రూమ్ లో బంధించారు. ఎలాగైనా రక్షించాలంటూ కుంటుంబ సభ్యులకు రవి వాట్సప్ వీడియో పంపాడు. కుటుంబ సభ్యులు విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు...

Wednesday, July 5, 2017 - 19:15

నెల్లూరు : జిల్లాలో మహిళలు మద్యం దుకాణంపై విరుచుకుపడ్డారు. శెట్టిగుంట రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపుని మహిళలు ధ్వంసం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో షాపు గోడలను, బోర్డును నేలకూల్చారు. ఈ షాపు సమీపంలో ప్రభుత్వ పాఠశాల, ఆలయం కూడా ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా షాపుని ఏర్పాటు చేయడం సరైంది కాదని మహిళలు మండిపడ్డారు. 

 

Tuesday, July 4, 2017 - 20:15

నెల్లూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు పోలీసులే తూట్లు పొడుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు నమోదు నుంచి విచారణలో కూడా పోలీసులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. అలాగే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను నీరు గార్చేందుకు యత్నిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు...

Tuesday, July 4, 2017 - 19:43

నెల్లూరు : జిల్లాలో పార్టీనాయకులు తీరు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది.  ఆత్మకూరు నియోజకవర్గంలో  వర్గపోరు భగ్గుమంటోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. టీడీపీ నాయకుల ఘర్షణలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ పావులు కదుపుతోంది. 
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరుతో...

Tuesday, July 4, 2017 - 06:37

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కార్మికవర్గం హక్కుల సాధనకు సమరశంఖం పూరించింది. సమస్యల పరిష్కారం కోరుతూ కోరుతూ కదం తొక్కింది. కనీస వేతన చట్టాలను అమలుచేయాలంటూ పలుచోట్ల కలెక్టరేట్లను కార్మికులు ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని కార్మిక నేతలు ధ్వజమెత్తారు. కార్మిక సమస్యలు...

Monday, July 3, 2017 - 21:54

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు అరుంధతిపాలెంలో మద్యం షాపులపై మహిళలు దాడులు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం షాపుపై దాడి చేసి మద్యం బాటిళ్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Monday, July 3, 2017 - 19:43

నెల్లూరు : ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. ప్రయాణికులను, జనాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు. ఆరుగురిపై దాడి చేశాడు. చివరికి ఆత్మహత్యకూ ప్రయత్నించాడు. నెల్లూరులోని సోన్‌ హౌజ్‌పేటలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆరుగురిపై కర్రతో దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఒళ్లు కాల్చుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అతికష్టంమీద...

Pages

Don't Miss