నెల్లూరు
Wednesday, July 15, 2015 - 14:30

నెల్లూరు : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. తమకు మద్దతు తెలపాలని కోరిన మహిళా కార్మికులపై టిడిపి కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మహిళలని చూడకుండా బూతులుదండకం చదివాడు. దీనిపై మహిళా కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏడో డివిజన్ కు చెందిన టిడిపి కార్పొరేటర్ కిన్నెర...

Sunday, July 12, 2015 - 17:58

నెల్లూరు: కోట్ల రూపాయలే లక్ష్యం.. రోగిని కోయడమే మార్గం అన్నది చాలా ఆస్పత్రుల పద్ధతి..! కానీ, సేవే లక్ష్యం.. మానవతే మార్గం అన్నది ఆ... ఆస్పత్రి సిద్ధాంతం..! డబ్బుకోసం శవాలకు కూడా వైద్యం చేస్తారు కొందరు డాక్టర్లు.. కానీ, పైసల కన్నా, ప్రాణాలు నిలిపేందుకే తాపత్రయ పడతారు అక్కడి వైద్యులు..! నిరుపేదలకు ఆరోగ్యం అందించడమే పరమావధిగా భావించి, ఏడు దశాబ్దాలుగా అలుపెరగని సేవలందిస్తోంది ఆ...

Sunday, July 12, 2015 - 15:43

నెల్లూరు: డా.రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రజారోగ్యం పరిరక్షణ-కార్పొరేటీకరణ' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రముఖ ఐఎఎస్ అధికారులు, మేధావులు, డాక్టర్లు హాజరయ్యారు. 

Saturday, July 11, 2015 - 07:05

నెల్లూరు : ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. ఇప్పటి వరకూ సొంత ప్రయోగాలతోనే సత్తాచాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తాజాగా విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన ఘనత సాధించింది. తన ప్రస్థానంలోనే భారీ వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. మరో భారీ వాణిజ్య ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో దాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు...

Friday, July 10, 2015 - 07:14

హైదరాబాద్:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి రాత్రి పీఎస్ ఎల్వీ సి -28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ 5 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. బుధవారం ఉదయం 7గంటల 28నిమిషాలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 62 గంటల 30 నిమిషాలు నిరంతరాయంగా కొనసాగి, నింగిలోకి...

Tuesday, July 7, 2015 - 17:34

నెల్లూరు : ప్రజా సమస్యలపై సీపీఎం ఉద్యమిస్తుందని, ఆగస్టు 1 నుండి 14 వరకు ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు బలోపేతం అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొనేందు సీఎం కొత్త మద్యం పాలసీని ప్రవేశ పెట్టారని విమర్శించారు. రైతాంగంలో తీవ్ర అలజడి నెలకొందని, కేంద్ర...

Monday, July 6, 2015 - 20:48

నెల్లూరు : ఆత్మకూరులో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్‌ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపును వెంటనే ఎత్తివేయాలంటూ కాలనీకి చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు. షాప్‌ను తెరవనీయకుండా ఎక్సైజ్‌ సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకుని మద్యం షాపును తొలగించాలంటూ ధర్నా చేపట్టారు....

Pages

Don't Miss