నెల్లూరు
Friday, January 12, 2018 - 11:21

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ పై...

Thursday, January 11, 2018 - 13:29

నెల్లూరు : కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ షాక్ తగిలింది. మేయర్ అజీజ్, ఆయన సోదరుడు, డైరెక్టర్ అనిల్ పై చీటింగ్ నమోదు అయింది. వీరి పై మద్రాస్ సెంట్రల్ క్రైమ్ బోర్డ్ చీటింగ్ కేసు నమోదు చేసింది. స్టార్ అగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లను అజీజ్ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, January 10, 2018 - 12:15

నెల్లూరు : జిల్లాలోని అల్లీపురంలో మంత్రి సోమిరెడ్డి ఆయన నివాసంలో 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు సోమిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో 10టీవీ దూసుకుపోతోందని మంత్రి సోమిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. 

 

Monday, January 8, 2018 - 06:40

నెల్లూరు : వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన విహంగాలు అక్కడ సేదతీరుతాయి. ఆ ప్రాంతంలోని పక్షుల కిలకిల రావాలు, విహంగాలు చేసే విన్యాసాలు చూసేందుకు సందర్శకులు దేశవిదేశాల నుండి తరలివస్తారు. అదే నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల కేంద్రం. ఇక్కడికి వచ్చే ప్రకృతి ప్రేమికుల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా పక్షుల పండుగను నిర్వహిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 25 జాతుల విదేశీ పక్షులకు...

Sunday, January 7, 2018 - 22:18

నెల్లూరు : జన్మభూమి కమిటీలు రాక్షస కమిటీలుగా మారాయని వాటిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులో సీపీఎం 23వ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం ఒక ప్రత్యామ్నాయ వేదికను నిర్మించాలని మహాసభలో...

Saturday, January 6, 2018 - 16:55

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణ ఓడీఎఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. స్కూల్స్ లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆడ పిల్లలు బడి మానేస్తున్నారని వాపోయారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు మనసు చంపుకుని రోడ్డు పక్కన మల విసర్జన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా...

Friday, January 5, 2018 - 21:15

నెల్లూరు : పట్టణంలో జరిగిన యువజన సభలో వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబుకు చేతకాలేదన్నారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని పప్పూకి మంత్రి పదవి ఇచ్చారని, కాని రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేకపోయారన్నారు.

 

Monday, January 1, 2018 - 18:02

నెల్లూరు : ప్రజల సమస్యలను ఎత్తిచూపడంలో టెన్‌ టీవీ ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో మంత్రి టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

Sunday, December 31, 2017 - 15:06

నెల్లూరు : మార్చి నెలాఖరుకల్లా నెల్లూరులోని పార్కులన్నింటినీ అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని పలు పార్కులను ఆయన పరిశీలించారు. నగరంలో ఉన్న 18 పార్కులు వాడుకలో ఉన్నాయని.. మరో 120 లే అవుట్లలో పార్కులకు స్థలాలు కేటాయించామని నారాయణ చెప్పారు. ప్రతి పార్క్‌లో వాకింగ్ ట్రాక్, టాయిలెట్లు, డ్రికింగ్ వాటర్, ఓపెన్ జిమ్ సిద్ధం చేయాలని మంత్రి...

Monday, December 25, 2017 - 19:19

గుంటూరు : ఏపీలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖలోని సెయింట్‌ పాల్స్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు మిన్నంటాయి. క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు ప్రభోదించిన బైబిల్‌ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్‌ ఫాదర్‌లు సూచించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలో యేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...

Pages

Don't Miss