నెల్లూరు
Tuesday, December 1, 2015 - 17:32

హైదరాబాద్ : నెల్లూరులో భారీవర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వర్షబీభత్సాన్ని ఎదుర్కొన్న జిల్లా మరోసారి వరుణుడు దాడి చేయడంతో అల్లాడిపోతోంది. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు ప్రాంతాలలో భారీ వర్షాలతో చెరువులు పొంగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

Tuesday, December 1, 2015 - 11:32

చిత్తూరు : ఎపిలోని పలు జిల్లాల్లో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తూర్పుమండలాలైన శ్రీకాళహస్తి, ఏర్పాడు, కేవిబిపురం, బీఎన్‌ కండ్రిగ, నగరి, పిచ్చాటూరు, పుత్తూరులలో భారీ వర్షం కురుస్తోంది. 359 చెరువులు ప్రమాదస్థితిలో ఉండగా 69 చెరువులకు గండ్లు పడ్డాయి.తొట్టంబేడు మండలం తారకొల్లు గుండ్లవాగులో వృద్ధుడు...

Tuesday, December 1, 2015 - 08:05

చిత్తూరు : నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే వర్షాలతో అల్లాడిపోతుంటే..తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది.
మళ్లీ వర్షాలు
రోవాన్ తుపాను..ఆ తరువాత...

Monday, November 30, 2015 - 19:46

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. తమిళనాడును ఆనుకుని ఈ ద్రోణి కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. 

Sunday, November 29, 2015 - 17:22

నెల్లూరు : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు- హరినాథపురంలోని పీపుల్స్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో మొక్కలు నాటారు. పీపుల్స్ పార్కును అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మధు హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. రాబోయే సంక్రాంతి ఆటల పోటీలను పార్కులోనే నిర్వహించేలా...

Sunday, November 29, 2015 - 16:09

నెల్లూరు : ఆక్రమణల తొలగింపులో నివాసాలు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని నాలాల ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కాల్వలపై అక్రమంగా నిర్మించిన బహుల అంతస్తుల హోటళ్లు, భవంతులను కూల్చిన తర్వాతే పేదల ఇళ్లను కూల్చాలని మధు అన్నారు. పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై...

Friday, November 27, 2015 - 07:12

నెల్లూరు : జిల్లా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలైన ఆనం సోదరులు కాంగ్రెస్‌ ను వీడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌తో పాతికేళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుని తెలుగుదేశం సైకిల్ ఎక్కబోతున్నట్టు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు ఆనం సోదరుల...

Thursday, November 26, 2015 - 21:07

నెల్లూరు : ఓ వింత వస్తువు ప్రజల్ని భయపెడుతోంది. జిల్లాలోని వాకాడ మండలం పంబలి వద్ద రాకెట్‌ ఆకారంలో ఉన్న ఓ వస్తువు సముద్ర తీరంలోకి కొట్టుకొచ్చింది. 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండడంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీని బరువు సుమారు 5 నుంచి 10 టన్నులు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అధికారులు పరీక్షించి ప్రజల భయాన్ని తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ...

Thursday, November 26, 2015 - 09:23

హైదరాబాద్ : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పార్టీని వీడనున్న ఆనం బ్రదర్స్ కొత్తగా ‘సైకిల్’ పార్టీలోకి చేరనున్నారట. ఈ మేరకు డిసెంబర్ 5న వీరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందని వార్తలు వస్తున్నాయి. రాంనారాయణ...

Wednesday, November 25, 2015 - 20:27

నెల్లూరు : సింహపురి పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని పేర్లు ఆనం బ్రదర్స్. నెల్లూరు రాజకీయాల్లో రాటుదేలిన ఈ లీడర్ల మనసు ఈమధ్య పరిపరి విధాలుగా పయనిస్తోంది. హస్తం పార్టీలో ఫ్యూచర్‌ లేని తెగ దిగాలు పడుతున్నారు. కొత్త నీడ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇంతకీ ఈ సింహపురి చిన్నోళ్ల పయనమెటు..?

ఒకరిది గంభీరం.. మరొకరిది చిద్విలాసం...........

మాట తూలే తంత్రం...

Tuesday, November 24, 2015 - 17:45

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా బ్రిడ్జీ సమీపంలో ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాతీయ రహదారిపై లారీకి పంక్చర్‌ వేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో పంక్చర్‌ వేస్తున్న మెకానిక్‌త పాటు రెండు లారీల్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు....

Pages

Don't Miss