నెల్లూరు
Tuesday, October 27, 2015 - 09:47

నెల్లూరు : జిల్లాలో ఘోరం జరిగింది. గూడూరు జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు వాసిగా గుర్తించారు.

 

Monday, October 26, 2015 - 07:43

నెల్లూరు : బారాషాహిద్‌ దర్గా ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గంధమహోత్సవం. అర్ధరాత్రి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి భక్తులు జాగారం చేశారు. ఊరేగింపుగా వచ్చిన ఈ గంధమహోత్సవాన్ని చూడటానికి అందరూ ఎదురు చూశారు. నెల్లూరు కోటమిట్టలోని అమినీయా మసీదులో పన్నెండు మంది ముస్లీం పెద్దలు కలిసి పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుకుని.. మేళతాళాల మధ్య కోలాహలంగా గంధాన్ని రాత్రి...

Saturday, October 24, 2015 - 21:20

విజయవాడ : ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్‌లో నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ఓ పక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని పలువురు తీవ్రంగా విమర్శలు...

Saturday, October 24, 2015 - 12:24

నెల్లూరు : కోరిన కోర్కెలు తీర్చే బారాషాహీద్ రొట్టెల పండుగ నెల్లూరు వైభవంగా ప్రారంభమైంది. ఏటా 4రోజుల పాటు జరిగే ఈ వేడుకకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. మత సామరస్యానికి చిహ్నంగా మారిన ఈ దర్గాలో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

 

Saturday, October 24, 2015 - 08:08

నెల్లూరు : దేశం నలుమూలల నుంచే కాదు, ఇతర దేశాలనుంచి వచ్చి పండగ చేసుకుంటారక్కడ. వేడుకలను చూసి తరించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తారు. లక్షలాదిమంది దేశవిదేశీయులు వచ్చే ఆపండగ విశిష్టత అంతా ఇంతా కాదు. నిర్వాహకులు సైతం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఆపండగ ఏమిటి..అదెక్కడ జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో వైవిధ్య ఉత్సవం
నెల్లూరు జిల్లాకే...

Wednesday, October 14, 2015 - 13:47

నెల్లూరు : జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. నగరంలో పేద ప్రజలు నివసించే ఇరుకళ పరమేశ్వరి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని మహిళ సజీవదహనమైంది. మంటలు మరో ఐదు ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పైసాపైసా కూడబెట్టుకొని తెచ్చుకున్న సామాగ్రి మంటల్లో కాలిపోవడంతో స్థానికులు...

Tuesday, October 13, 2015 - 19:15

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా మొదటి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన మన మట్టి, మన నీరుకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక పూజలమధ్య మట్టి, నీరు సేకరించారు. ఏపీలో మన మట్టి, మన నీరు కార్యక్రమం ఘనంగా మొదలైంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని సీఎం...

Sunday, October 11, 2015 - 21:39

నెల్లూరు : గుమ్మానికి తోరణం, చెవికి ఇంపుగా సన్నాయి లేనిదే ఏ శుభకార్యమూ పూర్తికాదు. నాదస్వరం లేకపోతే ఏ శుభకార్యం శుభకార్యంలా అనిపించదు. ఒట్టి తూతూ మంత్రంలా అనిపిస్తుంది. అల్లంత దూరాన సన్నాయి స్వరం వినగానే గుండెంతా పచ్చతోరణం కట్టినట్టయి పోతుంది. ఖచ్చితంగా అక్కడేదో శుభకార్యం జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి సన్నాయి ఏ మహానుభావుడి చేతిలో తయారయ్యిందో అనే సందేహం కలగక మానదు. వెదురును...

Sunday, October 11, 2015 - 13:32

నెల్లూరు : ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. రెయిన్‌ బో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ అనే మహిళ మృతిచెందింది. గోవిందంపల్లికి చెందిన ఓ మహిళ రోగికి అటెండెంట్‌గా వచ్చిన భాగ్యమ్మ పాలు తేవడానికి తెల్లవారుజామున ఐదో ఫ్లోర్‌ నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్‌ బటన్‌ నొక్కింది. అయితే డోర్‌ తెరుచుకున్నా.. లిఫ్ట్‌...

Sunday, October 11, 2015 - 12:15

నెల్లూరు : సంగంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం కుక్కలు జరిపిన దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా 8-10 కుక్కలు దాడులు జరిపాయి. శరీరంపై ఇష్టమొచ్చినట్లు కరిచాయి. దీనితో బాధితులకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీశారు. కానీ అక్కడ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వెంటనే కుక్కలను అరికట్టాలని.....

Sunday, October 11, 2015 - 08:10

నెల్లూరు : మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకపోవడానికి దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఓ మహిళపై కత్తితో దాడి బంగారాన్ని అపహరించుకపోయారు. గూడురులో చేపల వ్యాపారం చేసే సుబ్బమ్మ నివాసం ఉంటోంది. ఆదివారం చేపలను విక్రయించడానికి సమీపంలోనే ఉన్న మార్కెట్ కు వెళ్లింది. త్యాగరాజు వీధి వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చాడు. బంగారు...

Pages

Don't Miss