నెల్లూరు
Saturday, August 12, 2017 - 16:56

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.. నెల్లూరులో రోజా వేషధారణలోఉన్న మహిళకు పూలు, గాజులు వేశారు.. ఓ మహిళవై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం తగదంటూ మొట్టికాయలు వేశారు.

Wednesday, August 9, 2017 - 15:31

నెల్లూరు : జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు లక్ష్మీ ఆశా జ్యోతి అనే వివాహిత పై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. దుండగులు మహిళను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, August 8, 2017 - 16:37

నెల్లూరు : జిల్లాలోని ఆమంచర్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పసుపులేటి కృష్ణమూరిగా మరొకరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్టర్‌ షాజాద్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Saturday, August 5, 2017 - 07:10

నెల్లూరు : ముంబైలో నెల్లూరుకు చెందిన కోవూరు సుధీర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుధీర్‌ 2010లో ఎష్ ఎస్ సీ లో స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా 2017 గేట్‌ పరీక్షలో ఆలిండియా లెవల్లో మెకానికల్‌లో టాప్‌ ర్యాంక్‌ పొందాడు. బిపిసిఎల్ లో జాబ్‌ చేస్తున్న సుధీర్‌.. తాను ఉంటున్న క్వార్టర్‌లో ఉరేసుకున్నాడు. అయితే... సుధీర్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Thursday, August 3, 2017 - 21:13

నెల్లూరు : రాష్ట్రంలోనే సంచలనంగా మారిన క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా కేసును ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ ముగింపు పలికారు. ఇప్పటి వరకు 115 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బెట్టింగ్‌ మాఫియాతో సంబంధం ఉన్న ఎవరిని వదలే ప్రసక్తే లేదంటున్న నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్‌ నిర్వహించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, August 3, 2017 - 17:15

నెల్లూరు : జిల్లాలో కలకలం రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సంబంధమున్న ఖాకీలపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలను వీఆర్ కు పంపగా.. మరో ఇద్దరు సీఐలు అబ్దుల్ కరీం, రామకృష్ణారెడ్డిపై వేటు పడింది. మరోవైపు పట్టుబడ్డ బుకీలు, బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు వందమండి పట్టుబడినట్లు సమాచారం. 

...
Wednesday, August 2, 2017 - 11:24

నెల్లూరు : క్రికెట్ బుకిలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఇద్దరు డీఎస్పీలపై పోలీస్ శాఖ వేటు వేసింది. ఇద్దరు డీఎస్పీలను వీఆర్ కు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర డీఎస్పీ వెంకటరాముడు, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ ను వీఆర్ కు పంపిస్తూ పోలీస్ ఉన్నధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరిపై క్రికెట్ బెట్టింగ్ కాకుండా ఇసుక, ఎర్రచందనం అక్రమారవాణాకు సహకరించారంటూ విమర్శిలు ఉన్నాయి. మరింత...

Wednesday, August 2, 2017 - 09:09

నెల్లూరు : క్రికెట్ బుకీ డాన్‌ కృష్ణసింగ్ పోలీసుల విచారణలో బయటపెట్టిన పేరులో ఒకటిగా బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిగా తెలుస్తోంది.. ఇతను ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరు...ఉండేది మాగుంట లేఅవుట్...ఎమ్మెల్యేకు షాడోగా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కదిద్దేస్తారన్న పేరుంది...గతంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసిన శ్రీకాంత్‌రెడ్డి కృష్ణసింగ్‌తో దోస్తానా చేసి బెట్టింగ్‌ల్లో భాగస్వామ్యం...

Pages

Don't Miss