నిజామాబాద్
Monday, May 14, 2018 - 16:44

నిజామాబాద్ : అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి చెందాడు. మాచారెడ్డి మండలం అరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి డల్లాస్‌లోని గ్లోబల్‌ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్నేహితులతో ఈతకు వెళ్లి నీటిలో మునిగి శవమై తేలాడు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. మరో నెల రోజుల్లో స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో...

Monday, May 14, 2018 - 10:29

నిజామాబాద్ : ప్రేమించానన్నాడు..పెళ్లి చేసుకున్నాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ ప్రియురాలు మౌనపోరాటం..గత రెండు రోజులుగా ఆమె పోరాటం చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు..పైగా ఆమెపైనే దాడి కూడా జరగడం గమనార్హం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డి ఎదుట ప్రియురాలు మమత ఆందోళన చేపట్టింది....

Monday, May 14, 2018 - 06:31

నిజామాబాద్‌ : జిల్లాలో డీఎస్‌ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. డీఎస్‌ మళ్లీ సొంతగూటికి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే కార్యకర్తల ఒత్తిడి మేరకే సమావేశం ఏర్పాటు చేసినట్టు డీఎస్‌ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని డీఎస్‌ దగ్గర మొరపెట్టుకోగా... సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీనిచ్చారు.

...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Friday, May 11, 2018 - 19:45

నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే ఆదర్శమైన ప్రాజెక్ట్ అన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండలం మామిడిపల్లిలో రైతు బంధు పథకం కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.. పంట చేతికి వచ్చిన తర్వాత ధర రాకపోతే రెండు లక్షల రుణ సదుపాయం కల్పించామన్నారు కవిత. 

Friday, May 11, 2018 - 06:26

నిజామాబాద్‌ : జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న టీపీసీసీ నాయకత్వం... కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ... కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా పెట్టుకని...

Tuesday, May 8, 2018 - 06:36

నిజామాబాద్‌ : జిల్లా పల్లెచెరువు తండాలో తల్లీ, కొడుకుల మృతి మిస్టరీగా మారింది. అత్తింటివారే హత్య చేశారంటూ వారి ఇంటిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు తండాలో 144 సెక్షన్‌ విధించి పరిస్థితిని చక్కదిద్దారు. ధర్పల్లి మండలం పల్లె చెరువు తండాకు చెందిన మహిపాల్‌కు, మద్దిల తండాకు చెందిన బదావత్‌ లావణ్యకు ఐదేళ్ల క్రితం పెళ్లి...

Monday, May 7, 2018 - 11:25

నిజామాబాద్ : ధర్పల్లి మండలం దుబ్బాకలో విషాదం నెలకొంది. పల్లె చెరువు తండాలో కొడుకును చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, ఆడపడుచులే హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు అత్త ఇంటిపై దాడి చేసి, గుడిసెకు నిప్పుపెట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Tuesday, May 1, 2018 - 12:50

నిజామాబాద్‌ : జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.  సీపీఎం పార్టీ కార్యాలయంలో ఎర్రజెండా ఎగురవేసి మేడే వేడుకలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss