నిజామాబాద్
Sunday, May 14, 2017 - 10:47

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతూ ఇప్పటికే నానా అగచాట్లు పడుతున్న అన్నదాతలపై ప్రకృతి కూడా కత్తి గట్టింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే చోటు లేక.. ఇచ్చే టార్పాలిన్ లు సరిపోక రైతులు ఎదుర్కుంటున్న తీవ్ర ఇబ్బందులపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

...

Saturday, May 13, 2017 - 17:58

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో... 30 ఏళ్లుగా ఎదురుచూసిన... పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ రైల్వే లైన్‌ను సాధించిన ఘనత తమదంటే...తమదంటూ... బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఎవరికి వారే ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం చాలా కృషి చేశామంటూ.. పార్టీల నాయకులు.. ఒకర్ని ఒకరు దూషించుకుంటున్నారు....

Saturday, May 13, 2017 - 11:59

నిజామాబాద్: ఓ గ్రామ పంచాయితీ.. అభివృద్ధికి దిక్సూచిగా మారింది. చక్కని ప్రణాళికలతో ఆదాయ వనరుల్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. అధికారులు, ప్రజల మధ్య సమన్వయంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆ గ్రామం ఇప్పుడు జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందింది. స్వశక్తి కరణ్ పురస్కారానికి సైతం ఎంపికై ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ గ్రామం ఏది..? అక్కడ సాగిన అభివృద్ధి కార్యక్రమాలేవి?

...
Wednesday, May 10, 2017 - 14:41

నిజామాబాద్ : పూల దండలు కాదు.. పుస్తకాలు తెండి. పట్టు వస్త్రాలు కాదు.. పలకలు, పెన్నులు తెండి. అవి నా పిల్లలకు ఎంతగానో ఉపకరిస్తాయి. వారిని మేటి పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ఇవీ ఓ జిల్లా కలెక్టర్‌.. తనను కలిసేందుకు వచ్చే వారికి చేస్తున్న విన్నపం..! కాస్తంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం...! ఆమె నా పిల్లలు అని సంబోధించింది.. సొంత పిల్లల గురించి కాదు. అంతకన్నా ఎక్కువగా...

Sunday, May 7, 2017 - 13:12

నిజామాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. మత్స్యకారుల కడుపుకొట్టాయి. దీంతో మత్స్యకార కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఇంతకీ చేపలు ఎందుకు చనిపోయాయి.? 
అంతుచిక్కని వ్యాధితో చేపలు మృతి
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో సుమారుగా 10 వేల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి....

Saturday, May 6, 2017 - 17:02

నిజామాబాద్ : నిజమాబాద్‌ జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో.. ఏళ్లు గడుస్తున్నా పాలక వర్గ నియామకం జరగడం లేదు. మార్కెట్‌లో రైతులు సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నా.. పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అన్నదాతలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

ఏళ్లు గడుస్తున్నా ...

Friday, May 5, 2017 - 08:11

నిజామాబాద్ : తెలంగాణలో పసుపు రైతులకు కష్టకాలం వచ్చింది. గిట్టుబాటు ధర కోసం వ్యాపారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. దళారుల దోపిడికి అడ్డేలేకుండా పోయింది. దిగుబడి ఎక్కువగా రావడంతో.. వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు తగ్గించేశారు. పంటపై చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక.. నిజామాబాద్‌జిల్లాలో పసుపురైతు ప్రాణం విడిచాడు. 
పసుపు రైతులు కన్నీరు ...

Wednesday, May 3, 2017 - 13:43

జగిత్యాల : మద్దతు ధర కల్పించండి మహాప్రభో...మమ్మల్ని ఆదుకోండి..అంటూ రైతులు నినాదాలు పాలకుల చెవికి ఎక్కడం లేదు. గత కొన్ని రోజులుగా మద్దతు ధర కోసం ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మద్దతు ధర రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఎద్దండి గ్రామంలో బొయాన గంగారం అనే రైతు పసుపు పంటను...

Wednesday, May 3, 2017 - 11:06

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తోన్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించాయి. గత ఐదేళ్లుగా డిగ్రీ ఫీజులు పెరగక, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫీజులు పెంచే వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. తమ డిమాండ్లు...

Pages

Don't Miss