నిజామాబాద్
Thursday, August 24, 2017 - 13:27

నిజామాబాద్ : మనిషి.. మానవత్వాన్ని మరచి నేర ప్రవృత్తిని పెంచుకుంటున్న కాలమిది. రకరకాల నేరగాళ్లను నియంత్రించేందుకు.. నవీన వ్యవస్థలను రూపొందించుకుంటోన్న తరుణమిది. ఇలాంటి రోజుల్లోనూ.. ఓ గ్రామం అహింసా పరమో ధర్మః అంటూ ప్రవచిస్తోంది.. అదే ధర్మాన్ని అక్షరాలా పాటించి చూపుతోంది. ఫలితంగా.. మూడు దశాబ్దాలుగా పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామంగా భాసిల్లుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..?...

Tuesday, August 22, 2017 - 15:42

నిజామాబాద్ : నైరుతీ రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి ప్రభావం తోడవడంతో నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు కొద్దిగా జలకళ సంతరించుకుంది. మిషన్‌ కాకతీయలో భాగంగా పూడిక తీసిన చెరువుల్లో నీరు చేరుతోంది. భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లి విరుస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో మురిపించిన వర్షాలు ఈ తర్వాత ముఖం చాటేశాయి...

Monday, August 21, 2017 - 17:42

నిర్మల్ : బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహ తరలింపు అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో ఆలయ బీరువాలను తెరిచారు. రెండో బీరువాలో అమ్మవారి ఉత్సవ విగ్రహం లభ్యం కావడం విశేషం. ఉత్సవ విగ్రహం తీసుకెళిఆ్ల మళ్లీ తీసుకొచ్చి బీరువాలో పెట్టినట్లు ప్రధాన అర్చకుడు సంజీవ్ పై ఆరోపణలున్నాయి.

బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నల్గొండ అక్షరాభ్యాసానికి తరలించినట్లు...

Friday, August 18, 2017 - 13:41

నిజామాబాద్ : ధర్మపురి శ్రీనివాస్.. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. డీఎస్ కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని.. సోనియా గాంధీతో మాట్లాడారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని డీఎస్ ఖండించారు. తనకు టీఆర్‌ఎస్‌లో ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. తన...

Friday, August 18, 2017 - 07:52

నిజామాబాద్ : వర్షాలు ముఖం చాటేశాయి. ప్రవాహం లేక నదులు వెలవెలబోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీరు రాక ఉత్తరతెలంగాణ వరదాయని శ్రీరాంసాగర్‌ వట్టిపోతోంది. ఉత్తరతెలంగాణ జిల్లాల కల్పతరవు శ్రీరాంసాగర్‌ ఎండిపోతోంది. గోదావరిలో జలసిరులు కరువైపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టులో ఉన్ననీరుకూడా క్రమంగా తరిగిపోతుండటంతో ఆయకట్టు రైతాంగంలో ఆందోళన...

Thursday, August 17, 2017 - 18:59

నిజామాబాద్ : జిల్లాలోని బాన్స్‌వాడ నియోజకవర్గంలోని భైరాపూర్ గ్రామంలో 40 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పోచారంతో పాటు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు పోచారం...

Wednesday, August 16, 2017 - 17:14

నిజామాబాద్‌ : జిల్లాలోని నంది పేట మండలం అయిలాపూర్‌లో... ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ర్ట మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ డిమాండ్ చేసింది.  కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ యకినోద్దిన్‌.. కాళ్లకు వేసుకున్న షూను విడవకుండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ...

Tuesday, August 15, 2017 - 07:39

హైదరాబాద్: 2019 ఎన్నికలు..తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న గులాబీ పార్టీ..మరోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అభివృద్ధి నినాదాన్ని తీసుకోవ‌డంతో పాటు పార్టీకి సినీ గ్లామ‌ర్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజ‌యశాంతి పార్టీకి దూర‌మైనా గ‌త ఎన్నిక‌ల్లో...

Pages

Don't Miss