నిజామాబాద్
Thursday, August 10, 2017 - 21:42

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పున‌రుజ్జీవ‌ పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఆ త‌ర్వాత ప్రాజెక్టు వ‌ర‌ద కాలువ వ‌ద్ద ఉన్న పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పోచంపాడ్‌లో జ‌రిగిన‌ బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్రసంగించారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్షం చేశారని కేసీఆర్‌ మండిపడ్డారు. మేడిగ‌డ్డ, సుందిళ్ల, అన్నారం...

Thursday, August 10, 2017 - 17:08

నిజామాబాద్ : సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్థానికులను తరలించడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గులాబీ నేతల అత్యుత్సాహంతో... చాలా మంది రోడ్లపైనే ఇరుక్కుపోయారు. సభకు బయలుదేరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా... ఆర్మూర్ వద్ద 2 గంటల పాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు అతికష్టం మీద.. కేటీఆర్‌ నిజామాబాద్ చేరుకున్నారు.

Thursday, August 10, 2017 - 17:07

నిజామాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ప్రాజెక్టులపై కేసులు వేస్తూ కోర్టులకు వెళ్తున్నారని.. దీంతో ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరగడం లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.  

Thursday, August 10, 2017 - 17:05

నిజామాబాద్ : వచ్చే సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు లోగా కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ నింపితే.. నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అవకాశం వస్తుందని అన్నారు. ఎస్సారెస్పీకి 54 ఏళ్ల జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారని.. అయితే అది ఇంత వరకు పూర్తి చేయలేదన్నారు....

Thursday, August 10, 2017 - 17:04

నిజామాబాద్ : ఒక్క ఊరు మునగకుండా, ఒక్క ఇళ్లు మునగకుండా అతి తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న పోచంపాడు పునరుజ్జీవ ప్రాజెక్టుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ నేతలు అడ్డుతగలడం సరికాదని ఆయన అన్నారు.

Thursday, August 10, 2017 - 17:02

నిజామాబాద్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవన పథకానికి సీఎం కేసీఆర్ ఘనంగా శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులు పూర్తయితే జలాశయం ఏడాది అంతా జలకళతో కళకళలాడనుంది. రైతులకు 2 పంటలకు సాగునీరు అందనుంది. రివర్స్ పంపింగ్‌ విధానం ద్వారా ప్రాజెక్ట్‌ను నింపనున్నారు. 1067 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి...

Thursday, August 10, 2017 - 11:16
Thursday, August 10, 2017 - 06:24

హైదరాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పునురుజ్జీవన పథకానికి ఇవాళ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాలువల ఆధునీకరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం సఫలమైతే.. నిజామాబాద్ జిల్లా అన్నదాతల సాగునీటి...

Wednesday, August 9, 2017 - 17:52

నిజామాబాద్ : ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని... తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. రేపు శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్నారని తెలిపారు.. ఈ పథకంద్వారా మూడు జిల్లాలు సస్యస్యామలవుతాయని పోచారం తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Wednesday, August 9, 2017 - 17:51

నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పునురుజ్జీవన పథకానికి గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాలువల ఆధునీకరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం సఫలమైతే.. నిజామాబాద్ జిల్లా అన్నదాతల సాగునీటి...

Pages

Don't Miss