నిజామాబాద్
Friday, October 20, 2017 - 21:19

నిజామాబాద్‌ : జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. నవీపేట మండలం అబ్బాపూర్‌లో ఎర్రకుంట్ల రిజర్వాయర్‌ కాల్వ పనులను అడ్డుకున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తేనే పనులు కొనసాగనిస్తామని తేల్చి చెప్పారు. దీంతో కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి రైతులకు వద్దకు వచ్చి మాట్లాడారు. త్వరలో పరిహారం అందేలా చూస్తానని హామీ...

Friday, October 20, 2017 - 20:06

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నేరాలు పెరిగిపోతున్నాయి..డిపార్ట్‌మెంట్లో ఉంటూ...అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నవారు పెరిగిపోయారు..బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నవారే కీచకులుగా మారుతున్నారు...బాధితురాళ్లు స్టేషన్‌ వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు కోర్కెలు తీర్చాలంటూ వేధిస్తున్నారు..వెంటపడుతున్నారు...కామపిశాచాలుగా మారిన రెండు రాష్ట్రాల్లోని ఓ సీఐ,ఓ ఎస్సైలపై...

Friday, October 20, 2017 - 15:23

నిజామాబాద్ : బోధన్ సీఐ సురేంద్ రెడ్డి వ్యవహార శైలిపై టెన్ టివి ప్రసారం చేసిన వరుస కథనాలపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. ఐజీ ఆఫీసుకు బదిలీ చేశారు. మహిళలతో సీఐ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఓ వివాహిత రావడం జరిగింది. కానీ ఆమెతో సీఐ సురేందర్ అసభ్యకరంగా..అసభ్యపదజాలాన్ని వాడారనే ఆరోపణలున్నాయి. సీఐ మాట్లాడిన మాటలను ఆమె రికార్డు...

Wednesday, October 18, 2017 - 17:57

నిజామాబాద్ : దీపావళికి వారం ముందు నుంచే టపాకాయల అమ్మకాలు మొదలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కడికక్కడ టపాకాయల దుకాణాలు వెలిశాయి. ఇక్కడ వెలసిన చాలా దుకాణాలకు అనుమతులు లేవు. ఇవే కాకుండా ప్రధాన కూడళ్లలో, జనావాసాల్లో దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు కోట్ల రూపాయల్లో జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తమిళనాడులోని శివకాశి నుంచి...

Tuesday, October 10, 2017 - 12:03

 

నిజామాబాద్ : ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుంటే.. తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ప్రాజెక్టులో ఇంతవరకు భారీగా నీరు చేరుకోలేదు. ప్రస్తుతం 1094 అడుగులు మాత్రమే ఉంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 21:50

నిజామాబాద్ : తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ పోస్ట్‌ చేయలేదన్నాడు ఆర్‌డబ్ల్యూఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్‌. సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ పోస్ట్‌ చేశాడని కండక్టర్‌ అయిన సంజీవ్‌పై ఆర్టీసీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అయితే... కార్మికుల సమస్యపై స్పందించిన తనపై అకారణంగా విజిలెన్స్‌ విచారణ చేపట్టారన్నారు.

Monday, October 9, 2017 - 19:19

హైదరాబాద్ : నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్మూర్‌ సభలో మాట ఇచ్చి... దాని నెరవేర్చినందుకు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను... ఎంపీ కవిత కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ హబ్‌లో 50కిపైగా కంపెనీలు రానున్నాయని ఆమె తెలిపారు. కలెక్టరేట్‌ సమీపంలో స్థలం కేటాయించి... అమ్మాయిలు నిర్భయంగా పని చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Monday, October 9, 2017 - 15:08

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన ఓ ఆర్టీసీ కండక్టర్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. కేసీఆర్ పై ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన కండక్టర్ సంజీవ్ పై ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సంజీవ్ ప్రస్తుతం నిజామాబాద్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 14:56

నిజామాబాద్/ కరీంనగర్ : జిల్లాలో పొట్టకూటికోసం ఉపాధి వెదుక్కుంటూ విదేశాలబాట పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఏజెంట్లు అడ్డంగా దోచుకుంటున్నారు. మలేషియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల పాస్‌పోర్టులను ఏజెంట్లు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ తమ...

Pages

Don't Miss