నిజామాబాద్
Friday, December 25, 2015 - 13:26

నిజామాబాద్ : అనుకున్నంతా అయింది..రైతులు భయపడ్డట్టే జరిగింది. ఖండాంతరాల ఖ్యాతి గడించిన నిజాం చక్కెర కర్మాగారం మూతబడింది. ఇన్ని రోజులు చీకటిలో మిణుకుమిణుకుమంటూ మెరిసిన నిజాం చక్కెర కర్మాగారానికి తైలం వేసి దీపం వెలిగించాల్సింది పోయి మొత్తానికే ఆర్పేసింది ప్రభుత్వం.

ఆసియా ఖండానికే తలమానికంగా....

ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచిన...

Thursday, December 24, 2015 - 17:25

నిజామాబాద్ : ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల హెల్త్ కార్డులన్నీ ఆసుపత్రుల్లో అమలు చేయాలని, పడింట్ పీఈటీ టీచర్లను స్కూల్ అసిస్టెంట్ లుగా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, అన్ని పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఇంగ్లీషు మీడియం...

Monday, December 21, 2015 - 20:19

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి శుభవార్త వినిపించారు. ఏప్రిల్ చివరి వారంలో డీఎస్పీ ప్రకటన..జూన్ రెండో వారంలో డీఎస్సీ ఉంటుందన్నారు. జూన్ చివరి వారంలో డీఎస్సీ ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాల అనంతరం జులై రెండో వారంలో అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే మార్చి తొలి వారంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్...

Monday, December 14, 2015 - 06:32

నిజామాబాద్ : అధికారపక్షం దెబ్బకు ప్రతిపక్షం కుదేలైంది. ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను చేర్చుకుంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీసిన అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కకావికలం చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులనే పోటీ నుంచి ఉపసంహరింపజేసే చర్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరంగల్‌ తరహాలోనే నిజామాబాద్‌లో జెడ్పీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి...

Sunday, December 13, 2015 - 19:48

నిజామాబాద్ : జిల్లాలో కరవు తాండవిస్తోంది. అన్నదాతను కాలం కాటేసింది. జిల్లాలో ఎటు చూసినా ఎండిన పంటలు, బీటలు వారిన పొలాలే దర్శనమిస్తున్నాయి. రెండేళ్ల నుండి వరుణుడు కరుణించకపోవడంతో.. 49 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో సర్కార్‌ ఈ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించింది.
కరవు రక్కసి
నిజామాబాద్‌ జిల్లాలోని మొత్తం 36 మండలాల్లో కరవు రాక్షసి తాండవం...

Sunday, December 13, 2015 - 18:55

నిజామాబాద్‌ : జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ భూపతిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే కృషి చేస్తానని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. డాక్టర్‌ వృత్తిని...

Friday, December 11, 2015 - 15:28

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలుంటే కేవలం ఐదు స్థానాల్లో టి.కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలిపింది. నామినేషన్ లు పూర్తయిన అనంతరం ఆ పార్టీకి షాక్ ల మీద షాక్ లు కలుగుతున్నాయి. ఊహించన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లో అభ్యర్తులను నిలపడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో టి.పిసిసి...

Thursday, December 10, 2015 - 21:28

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. ఆశా వర్కర్లు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రం నలుమూలలా...

Tuesday, December 8, 2015 - 09:35

నిజామాబాద్ : నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. గతంలో విద్యాలయంలో పని చేసిన ఉపాధ్యాయులు తమ పనితనాన్ని, పూర్వ విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇతర దేశాల్లో పని చేస్తున్న వారు వీడియో సందేశాలు పంపి తోటి స్నేహితులతో పాత మధుర స్మృతులను...

Sunday, December 6, 2015 - 17:07

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపేందుకు మరో ఇద్దరు అభ్యర్థులను టీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ లో పార్టీ నేత కేకే మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ.. నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపతిరెడ్డి బరిలో నిలుచుంటారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా...

Saturday, December 5, 2015 - 21:01

హైదరాబాద్: 2016 సంవత్సరానికిగానూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. మొత్తం 44 రోజుల సెలవు దినాలలో 23 సాధారణ సెలవులు కాగా, 21 ఐచ్ఛిక సెలవులున్నాయి. ఈ మేరకు శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 26న గణతంత్ర దినోత్సవం, మార్చి 7న మహాశివరాత్రి, 23న హోలీ, 25న గుడ్‌ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రాం జయంతి, 8న ఉగాది, 14న అంబేద్కర్ జయంతి...

Pages

Don't Miss