నిజామాబాద్
Friday, December 1, 2017 - 17:26

నిజామాబాద్ : దళితులపై దాడులు జరిగితే..వివక్ష జరిపితే సంబంధిత కారకులైన వారిపై చర్యలు తీసుకోరా ? దళితులకు న్యాయం జరిగేదెన్నడూ..? నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన జరిగి రోజులవుతోంది. కానీ సర్కార్..ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి.

అభంగపట్నంలో ఇద్దరు దళితులపై స్థానిక...

Friday, December 1, 2017 - 12:54

నిజామాబాద్‌ : జిల్లాలోని అభంగపట్నంలో బీజేపీ నేత చేతిలో అవమానానికి గురైన దళిత యువకల ఆచూకీ ఇంకా లభించలేదు. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితుడిని కూడా పోలీసులు పట్టుకోలేదు. ముగ్గురి ఆచూకి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినా నిందితుడు భరత్ రెడ్డి, ఇద్దరు దళితులు ఎక్కడున్నారనేది ఇంకా మిస్టరీగానే ఉంది. 

నిజామాబాద్‌ జిల్లా అభంగపట్నంకి చెందిన బీజేపీ...

Wednesday, November 29, 2017 - 15:55

నిజామాబాద్ : పేదరికంలో మగ్గిపోతూనే డాక్టర్‌ అయ్యాడు. తన చదువు పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాడు. అంతటితోనే సంతృప్తి పడలేదు. నిత్యం గిరిజన తండాల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిజామబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్‌ మోతీలాల్‌ ప్రజల చేత శహబాష్‌ అనిపించుకుంటున్నారు.
పేదరికం బాధిస్తున్నా పట్టుదలగా చదువు పూర్తి ...

Sunday, November 26, 2017 - 06:47

ఖమ్మం : ఒకరు మూగ. మరొకరు చెవిటి. అయితేనేం ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మాటలు రాకున్నా మనసులు కలిశాయి. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ అనే పదానికి అసలైన నిర్వచనం ఇస్తూ... సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచిందో జంట. ఇంతకీ ఎవరా జంట. ఏమా పెళ్లి కథ. లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ... ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఒకరినొకరు ఇష్టపడటం. ఒకరికి మరొకరు అండగా...

Saturday, November 25, 2017 - 11:47

కామారెడ్డి : మీ ఫోన్ నెంబర్ కు లక్కీ డ్రా వచ్చింది..గెలాక్సీ గోల్డ్ గెలుచుకున్నారు...పోస్టపీసుకు వెళ్లి..డబ్బు కట్టి..గిఫ్టులను తీసుకోండి...ఇలాంటి ఫోన్ వచ్చిందా ? ఈ ఫోన్ ఫేక్...ఇలాగే వచ్చిన ఫోన్ కాల్ నిజం అని నమ్మి వెళ్లిన వారు మోసపోయారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ కు చెందిన జాకీర్ పై విధంగా ఫోన్ వచ్చింది. ఇతను పోస్టాపీస్ కు వెళ్లి రూ. 3200 చెల్లించి అడ్రస్ తో ఉన్న ప్యాక్ ను...

Saturday, November 25, 2017 - 06:45

నిజామాబాద్ : ప్రతిష్టాత్మక మిషన్‌ కాకతీయ పనుల లోపాలను కాగ్‌ కడిగిపారేసింది. చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం చాలా జిల్లాలో పక్కదారి పట్టిందని తలంటింది. పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదన్న కాగ్‌ నివేదికకు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన మిషన్‌ కాకతీయ అవకతవకలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిషన్‌ కాకతీయ...

Friday, November 24, 2017 - 16:36
Wednesday, November 22, 2017 - 16:06

Pages

Don't Miss