నిజామాబాద్
Tuesday, March 29, 2016 - 13:59

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల జీత భత్యాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఈ బిల్లును మంగళవారం శాసనసభ ఆమోదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను ఒక్కసారిగా రూ. 95వేల నుండి రూ. 2.5 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఈ వేతనాల పెంపును సీపీఎం వ్యతిరేకించింది. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన తెలంగాణలో పెంచాల్సినవసరం లేదని...

Monday, March 28, 2016 - 16:36

నిజామాబాద్ : కన్నతండ్రే కసాయిగా మారాడు. మద్యం మత్తులో చిన్నారిని హత్య చేశాడో ఓ కన్న తండ్రి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారంలో చోటుచేసుకుంది. కూలీ పనులు చేసుకునే నవీన్ తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి.. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న చిన్నారిని చంపేశాడు. తెల్లవారుజామున నిర్జీవంగా పడి ఉన్న బాలుడిని చూసిన భార్య మమత భోరున విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ ను...

Saturday, March 26, 2016 - 08:12

నిజామాబాద్ : రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఓ కార్యక్రమం ఇప్పుడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.  అర్ధాంతరంగా తనువు చాలించిన వారి నుంచి అవయవాలను సేకరించి ఆపదలో ఉన్న వారికి అమర్చుతున్నారు. ఈ  ప్రక్రియకు జీవన్ దాన్ సంస్థ శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలో దీనికి అన్యూహ స్పందన వస్తోంది.
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో 'జీవన్ దాన్ఋ ప్రారంభం
జీవన్...

Friday, March 25, 2016 - 07:28

నిజామాబాద్ : హోలీ అంటే అందరూ గులాల్ చల్లుకుంటారు. రంగు రంగుల నీళ్లు పోసుకుంటారు. కొంతమంది అయితే కోడిగుడ్లు విసురుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో హోలీనీ వింతగా జరుపుకుంటారు. ఏంటీ ఆ వింత అనుకుంటున్నారా! అయితే ఇటు ఓ లుక్ వేయండి! 
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు 
జిల్లాలోని బోధన్ మండలం హున్సా గ్రామంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఒకరు కాదు ఇద్దరు...

Wednesday, March 23, 2016 - 16:05

నిజామాబాద్ పెద్దసుపత్రిలో సమస్యలు తిష్ట వేసాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని నిర్మించి ఆదరణ మరిచారు. అన్ని హంగులతో ఆస్పత్రి భవనాన్ని నిర్మించి నిర్వహణ మరిచారు. ప్రతి ఏటా ఆస్పత్రి నిర్వాహాణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాసమస్యలు మాత్రం తీరడం లేదు. పైన పటారం లోన లోటారంగ మారుతున్న  నిజామాబాదు పెద్దాసుపత్రి నిర్వహణ తీరు పై 10 టీవి ప్రత్యెక కథనం.
జిల్లా కేంద్రం లో ఉచితంగా...

Monday, March 21, 2016 - 07:53

నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో మహిళలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. కొందరు యువకులు ఓ ముఠాగా ఏర్పడి మహిళలే టార్గెట్‌గా  స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గతంలో నిర్మానుష్య  ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దుండగులు, నేడు రద్దీగా ఉండే ప్రాంతాలు..  వ్యాపార...

Wednesday, March 16, 2016 - 17:46

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బాలికల హాస్టల్లోకి చొరబడి ఫోటోలు, వీడియో తీస్తున్న ఆకతాయిలను స్థానికులు దేహశుద్ధి చేశారు. హాస్టల్లో బాలికలు స్నానాలు చేస్తున్నప్పుడు ఫోటోలు తీస్తున్నారన్న సమాచారంతో హాస్టల్‌ వాచ్‌మెన్‌ ఆకతాయిలను రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..పట్టుబడ్డ బాలుడిని విచారణ చేస్తున్నారు. 

Thursday, March 10, 2016 - 22:10

ఢిల్లీ : తెలంగాణకు కేంద్రం ఏమాత్రం సహకరించడంలేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా లోక్‌సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు 450 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కవిత ఎఫ్ ఆర్ బిఎం పెంచాలని రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా స్పందించడంలేదని చెప్పారు. ట్యాక్స్ విధానంలో...

Thursday, March 10, 2016 - 18:48

నిజామాబాద్‌ : ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్టుగా... నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని నిజామాబాద్‌లో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని ట్రేడ్ యూనియన్ల అద్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల పొట్టలు కొట్టె జీవోలను రద్దు...

Tuesday, March 8, 2016 - 10:20

నిజామాబాద్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇల్లాలిగా, గృహిణిగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆకాశంలో సగం, భూమిపైనా సగం తమదేనంటున్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తున్న నిమాజామాబాద్‌ జిల్లాలో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు...

Monday, March 7, 2016 - 17:33

తెలంగాణలోని ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.. మహా శివరాత్రిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. స్వామివారిని దర్శించుకొని భక్తిభావంలో మునిగిపోయారు. మహాశివరాత్రి వేడుకలతో తెలంగాణలోని ఆలయాలన్నీ సందడిగామారాయి. వరంగల్‌ వేయి స్తంబాల గుడిలో శివుడి నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామునుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. అయితే రద్దీ పెరిగి దర్శనం కోసం భక్తులు...

Pages

Don't Miss