నిజామాబాద్
Wednesday, February 3, 2016 - 17:33

నిజామాబాద్ : చనిపోయిన తరువాత గుర్తుండేందుకు సమాధిని నిర్మిస్తారు. అది సంప్రదాయం. కానీ బతికుండగానే ఒ వ్యక్తి తన సమాధిని నిర్మించుకున్నాడు. కొడుకులకు తాను చనిపోయిన తరువాత ఎలాంటి భారం కావద్దనుకున్నాడో.. మరేమోగానీ తన భార్య సమాధి వద్దే తన సమాధిని నిర్మించుకున్నాడు.

పడాల గంగాధర్, చంద్రబాగు దంపతులు

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్...

Wednesday, February 3, 2016 - 07:12

హైదరాబాద్ : జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకుగాను తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పన, పారదర్శకత, వికలాంగులకు పని కల్పించడం సహా సరైన సమయంలో డబ్బులు చెల్లించినందుకు గాను తెలంగాణకు ఈ అవార్డులు లభించాయి. జాతీయ ఉపాధిహామీ పధకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో...

Saturday, January 30, 2016 - 13:56

నిజామాబాద్‌ :  జిల్లా రైతుల్ని కరువు మరింత కుంగదీస్తోంది.. పంటల సాగు సగానికి సగం తగ్గిపోవడంతో రైతన్నలు అప్పుల్లో మునిగిపోయారు.. రెండేళ్లుగా వర్షాలు లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వర్షాలు కురుస్తాయి... కనీసం ఈసారైనా అప్పులన్నీ తీరతాయనుకున్న రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది.. కరువుతో కొట్టుమిట్టాడుతున్న నిజామాబాద్ జిల్లా రైతులు మరింత అప్పుపాలయ్యారు.. కుటుంబపోషణ...

Wednesday, January 27, 2016 - 20:00

జీహెచ్ఎంసీ ఎన్నికలు..కొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుంది. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి అధికార..విపక్ష సభ్యులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అందులో భాగంగా ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సీం కేసీఆర్ కూతురు ఎంపీ కల్వకుంట్ల కవిత, కుమారుడు మంత్రి కల్వకుంట తారకరామారావులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి...

Wednesday, January 27, 2016 - 17:24

హైదరాబాద్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు లోకం తెలియదని నిజామాబాద్ ఎంపీ కవిత ఘాటు విమర్శలు చేశారు. నగరాన్ని తామే అభివృద్ధి చేశామని లోకేష్ చెప్పుకుంటున్నారని, ఎన్టీఆర్ కంటే ముందే నగరం అభివృద్ధి జరిగిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూజే ఏర్పాటు చేసిన ప్రెస్ ద మీట్ లో ఆమె మాట్లాడారు. బీజేపీ తెలంగాణకు చేసేందేమి లేదని, నగరానికి రూ. 20వేల కోట్ల ప్యాకేజీ...

Thursday, January 21, 2016 - 16:52

నిజామాబాద్ : బాలికలపై అత్యాచార యత్నం చేసిన ఆర్మీ కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నిజామాబాద్‌ సదాశివనగర్‌ మండలం రామారెడ్డి గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎంపీటీసీగా ఉన్న కిరణ్‌కుమార్‌ తండ్రి ఆ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరో నిందితుడు నితీష్‌కుమార్‌ను కూడా కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. 

 

Thursday, January 21, 2016 - 12:36

నిజామాబాద్ : జిల్లాలో కారుణ్య మరణానికి అనుమతి కోరుతున్న ముగ్గురు కానిస్టేబుళ్ల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖను కుదిపేస్తోంది. రూరల్‌ పీఎస్‌ నుంచి ఏఆర్‌ విభాగానికి బదిలీ చేయడంపై బాధిత కానిస్టేబుళ్లు భగ్గుమంటున్నారు. విధులు నిజాయితీగా నిర్వహించడమే తప్ప అని ఆక్రోశిస్తున్నారు...అసలు వారి ఆరోపణలకు కారణాలేంటి..? వారు చెబుతున్నట్లు రికవరీ సొమ్ము బొక్కేసిందెవరు...

Saturday, January 9, 2016 - 12:13

సమాజం దూరంగా పెడుతుంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాయి. సామర్థ్యం ఉన్నా ఉద్యోగం రానంటోంది. చదువుకుంటామన్నా స్కూళ్లు కుదరదంటున్నాయి. ఏ ఆధారం దొరక్కపోయినా బతుకు పోరాటం చేస్తున్నారు. ఎక్కడో కొందరు ఆదరించిన చోట ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. వేధింపులు..ఛీత్కారాలు భరిస్తూనే జీవితంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వాళ్లే 'హిజ్రా'లు. తాము ఎలాంటి బాధలు..ఆవేదన..నిర్లక్ష్యం...

Wednesday, January 6, 2016 - 06:33

హైదరాబాద్ : టైమ్ టేబుల్ ఖరారైంది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్‌అయింది. తెలంగాణలో విద్యాక్యాలెండర్ విడుదలైంది. అర్హతా పరీక్షలకు సంబంధించిన తేదీలు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ నుంచి పీసెట్‌ వరకూ అన్ని ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలు సర్కార్‌ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సెట్ల తేదీలను ప్రకటించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 2న ఎంసెట్...

Tuesday, January 5, 2016 - 17:38

నిజామాబాద్ : పచ్చని పైరు ఎండిపోయింది. వడ్లు లేవు సరికదా గడ్డి కూడా మొలవడం లేదు. తీవ్ర వర్షాభావ ప్రభావం రైతులపైనే కాదు ఇప్పుడు మూగజీవాలపైనా పడింది. నిండైన పాలపొదుగుతో నిగనిగలాడిన పశువులు ఇప్పుడు గ్రాసం లేక బక్కచిక్కిపోతున్నాయి. చివరకు దళారుల చేతుల్లోకి చేరుతున్నాయి.

ఎన్ని యంత్రాలు వచ్చినా....

ఆధునిక వ్యవసాయంలో ఎన్ని యంత్రాలు...

Tuesday, January 5, 2016 - 12:21

మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ పాన్ గల్లికి చెందిన రైతు షేక్ నజీమ్ ఫాషా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటిన్నర ఎకరం పొలంతో పాటు పక్కనే ఉన్న రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులు..భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీరు లేక పంట మొత్తం ఎండిపోయింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఫాషా తన పొలంలోనే ఉరి...

Pages

Don't Miss