నిజామాబాద్
Monday, February 19, 2018 - 20:50

నిజామాబాద్ : ఆర్మూరు అంతటా నిర్బంధకాండ..రైతు కనిపిస్తే అరెస్టులే..బంద్‌ను నీరుగార్చే క్రమంలో పోలీసుల ఓవరాక్షన్‌..ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతులు బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా.. పోలీసులు రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. తెల్లవారుజామునే రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పాత బస్టాండ్ నుంచి...

Monday, February 19, 2018 - 19:43

ఎర్రజొన్న కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే పండిస్తారని, అసలు మద్దతు ధర పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఎర్రజొన్న మద్దతు ధరపై మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీఆర్ఎస్ నేత రామ్మోహన్ అన్నారు. ఆర్మూర్ బంద్ విజయవంతం కావడంపై రైతులను తను అభినందిస్తున్నాని కాంగ్రెస్ నేత అంద్దకి దయాకర్ అన్నారు. ఎర్రజొన్నకు పెట్టుబడికి ఎక్కువగా ఉందని, ధర మాత్రం...

Monday, February 19, 2018 - 12:49

నిజామాబాద్ : ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతులు బంద్ పాటిస్తున్నారు. పసుపు..ఎర్రజొన్న కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న అధికారులు..ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలున్నాయి. దీనితో సోమవారం రైతులు ఆర్మూర్ రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారులపై రైతులు నిరసన తెలిపారు. ఆందోళన...

Sunday, February 18, 2018 - 07:33

నిజామాబాద్ : జిల్లాలోని ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు రైతన్నలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్, జక్రాన్ పల్లి, కమ్మర్ పల్లి, బాల్కొండలో రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. పోలీస్‌ ఆంక్షల మధ్య  రైతులు భారీ ప్రదర్శన నిర్వహించి.. తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఈనెల 19న ఆర్మూర్ పట్టణ బంద్...

Friday, February 16, 2018 - 20:23

నిజామాబాద్‌ : జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న ఎర్రజొన్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు పోలీసులు. రైతుల అరెస్ట్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

Friday, February 16, 2018 - 06:38

నిజామాబాద్‌ : జిల్లాలో రైతు సమస్య రాజకీయ రంగు పులుముకుంటోందా... ఎర్రజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోదని... 4500 రూపాయలు ప్రకటించే వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.... మరో వైపు మద్దతు ధర ప్రకటన ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని... దీనిపై కాంగ్రెస్‌ అనవసర రాద్దాంతం చేస్తోందని టీఆర్ఎస్‌ విమర్శిస్తోంది. అంతేకాదు.. మద్దతు ధరపై సంతోషాన్ని...

Thursday, February 15, 2018 - 15:31

నిజామాబాద్ : జిల్లా ఆర్మూరులో ఎర్రజొన్న రైతులు దీక్షకు దిగారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల దీక్షకు పోలీసులు నిరాకరించడంతో ఆర్మూరులో భారీగా పోలీసులను మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, February 12, 2018 - 07:26

నిజామాబాద్ : జిల్లా జక్రాన్‌పల్లిలో పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. పసుపుకు క్వింటాకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు 4 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎర్రజొన్నలకు 1500 రూపాయలు కూడా ఇవ్వని దళారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేయించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Friday, February 9, 2018 - 17:39

నిజామాబాద్ : ఎర్రజొన్న, పసుపు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. నిజమాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఎర్రజొన్న రైతులకు మద్దతుగా రైతు జేఏసీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. దళారుల దోపిడి నుండి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలన్నారు. 

Pages

Don't Miss