నిజామాబాద్
Tuesday, September 5, 2017 - 19:30

నిజామాబాద్ : జిల్లాలో మరో అకృత్యం వెలుగు చూసింది. ఆర్మూర్ మండలం ఇసాపల్లిలో దళితుల గణేష్ ఉత్సవాలపై అగ్రకులాల వారు దాడి చేశారు. దళితుల వినాయక ప్రతిమ ఊరేగింపు అడ్డుకుని దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకున్న ముగ్గురు దళిత యువకులను తరుముతూ దాడి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, September 4, 2017 - 19:08

నిజామాబాద్ : నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ గేటును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తివేశారు. దీంతో నీరు వృధా అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 12వ నెంబరు గేటును స్వల్పంగా ఎత్తి వేశారు. అసలే నీళ్లు లేకుండా ఉన్న డ్యాంలో దుండగులు గేట్ ఎత్తివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా పట్టపగలే అనామకులు గేట్లను ఎత్తి వేయడం నీటి పారుదల శాఖ అధికారుల అలసత్వానికి...

Sunday, September 3, 2017 - 16:44

నిజామాబాద్ : ఎన్నికలకుముందు కార్మికవర్గానికి ఇచ్చిన హామీలేవీ.... టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని... సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో  సీఐటీయూ ఎనిమిదవ జిల్లా మహాసభలకు భాస్కర్‌తోపాటు... జయలక్ష్మి హాజరయ్యారు.

Tuesday, August 29, 2017 - 16:43

నిజామాబాద్‌ : జిల్లా ప్రభుత్వాస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా ఫలితం నీరుగారిపోతోంది. రోజు రోజుకీ ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువైపోతుండడంతో తగిన సిబ్బంది లేక,  ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. 
ఆస్పత్రిలో సిబ్బందిలేమితో రోగుల ఇబ్బందులు
నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో...

Thursday, August 24, 2017 - 13:27

నిజామాబాద్ : మనిషి.. మానవత్వాన్ని మరచి నేర ప్రవృత్తిని పెంచుకుంటున్న కాలమిది. రకరకాల నేరగాళ్లను నియంత్రించేందుకు.. నవీన వ్యవస్థలను రూపొందించుకుంటోన్న తరుణమిది. ఇలాంటి రోజుల్లోనూ.. ఓ గ్రామం అహింసా పరమో ధర్మః అంటూ ప్రవచిస్తోంది.. అదే ధర్మాన్ని అక్షరాలా పాటించి చూపుతోంది. ఫలితంగా.. మూడు దశాబ్దాలుగా పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామంగా భాసిల్లుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..?...

Tuesday, August 22, 2017 - 15:42

నిజామాబాద్ : నైరుతీ రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి ప్రభావం తోడవడంతో నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు కొద్దిగా జలకళ సంతరించుకుంది. మిషన్‌ కాకతీయలో భాగంగా పూడిక తీసిన చెరువుల్లో నీరు చేరుతోంది. భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లి విరుస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో మురిపించిన వర్షాలు ఈ తర్వాత ముఖం చాటేశాయి...

Monday, August 21, 2017 - 17:42

నిర్మల్ : బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహ తరలింపు అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో ఆలయ బీరువాలను తెరిచారు. రెండో బీరువాలో అమ్మవారి ఉత్సవ విగ్రహం లభ్యం కావడం విశేషం. ఉత్సవ విగ్రహం తీసుకెళిఆ్ల మళ్లీ తీసుకొచ్చి బీరువాలో పెట్టినట్లు ప్రధాన అర్చకుడు సంజీవ్ పై ఆరోపణలున్నాయి.

బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నల్గొండ అక్షరాభ్యాసానికి తరలించినట్లు...

Pages

Don't Miss