నిజామాబాద్
Sunday, June 11, 2017 - 16:08

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని ప్రభుత్వ మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్‌ నిరాదరణకు గురవుతోంది. లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. పాల ఉత్పత్తి పెంచడం కోసం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ మూతపడింది. ప్రభుత్వం స్పందించి వెంటనే మినరల్‌ మిక్చర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

2014 ఏర్పాటు.....

Sunday, June 11, 2017 - 13:23

కామారెడ్డి : వేసవి సెలవులు ముగిసిపోయాయి. కొత్త విద్యా సంవత్సరంలో అడుగుపెట్టేందుకు విద్యార్ధులు సిద్ధం అవుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విస్తృత ప్రచారానికి తెరలేపాయి. రంగు రంగుల బ్రోచర్లతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రచార ఆర్భాటాన్ని చూసి ముచ్చట పడిన పేరెంట్స్ వారు చెప్పిన ఫీజుల లెక్కలు చూసి నోరెళ్లబెడుతున్నారు. కామారెడ్డి జిల్లా...

Friday, June 9, 2017 - 13:16

నిజామాబాద్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మారినా పనులు మాత్రం వేగం అందుకోవటం లేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏళ్లు గడచినా..సొరంగ మార్గం పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం డిజైన్ మార్చటం వలన...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Wednesday, June 7, 2017 - 19:42

నిజామాబాద్ : తన పొలంలో నుండి వెళుతున్న కాలువకు నష్టపరిహరం చెల్లించటం లేదని మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కమ్మర్‌ పల్లిలోని తన పొలంలో రైతు ఏలేటి గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో... ప్రమాదం తప్పింది. కమ్మర్ పల్లి గ్రామ శివార్లలో కప్పలొద్ది వద్ద చెక్ డ్యాం ఉంది....

Tuesday, June 6, 2017 - 10:39

నిజామాబాద్: ఒక వ్యాపారం దెబ్బతింటే పెట్టుబడిదారులకు మాత్రమే నష్టం ... కానీ ఓ పరిశ్రమ మూతబడితే వందలాది మంది జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దశాబ్దకాలంగా పారిశ్రామిక రంగం అనేక ఒడిదుడుకులకు గురవుతోంది. ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రమల కంటే మూతబడుతున్న పరిశ్రమల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.

ఏటా తాళాలు పడుతున్న చిన్నతరహా పరిశ్రమలు...

Tuesday, June 6, 2017 - 10:33

నిజామాబాద్‌ : జిల్లా నవీపేట మండలం సిరంపల్లిలో ట్రాక్టర్‌ బోల్తా పడి, మంటలు చెలరేగిన ఘటనలో డ్రైవర్‌ ఆంజనేయులు సజీవదహనమయ్యాడు. మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సిరంపల్లి గ్రామంలో వ్యవసపాయ ఉపకరణాలు దింపి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Monday, May 29, 2017 - 19:08

నిజామాబాద్ : స్మార్ట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా... లక్కంపల్లిలో సెజ్‌ చేపట్టిన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదు. 2015 నవంబర్ 15న కేంద్రమంత్రులు హర్షిమ్రత్ కౌర్ బాదల్, సాద్వి నిరంజన్లు మెగా ఫుడ్‌ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం...

Pages

Don't Miss