ప్రకాశం
Wednesday, November 14, 2018 - 07:25

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుపాను చెన్నైకి 620 కిలోమీటర్లుదూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. 15వ తేదీ గురువారం తుపాను బలహీన పడి కడలూరు, పంబన్ ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. గజతుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి ...

Monday, November 12, 2018 - 11:08

అమరావతి: తిత్లీ తుపాను నష్టం నుంచి  ఉత్తారంధ్ర తేరుకోక ముందే మరో తుపాను ఆంధ్రప్రదేశ్ ను వణికించేందుకు సిధ్దమవుతోంది . దీనికి "గజ తుపాను"గా అధికారులు నామకరణం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారి ఈనెల 15న చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ విభాగం అధికారులు అంచనా  వేస్తున్నారు. గజ తుపాను ప్రస్తుతం...

Monday, November 5, 2018 - 13:36

ప్రకాశం : జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లుల మంజూరులో వివక్షపై చైర్మన్‌ను విపక్షాలు నిలదీశాయి. బడ్జెట్ నిధులు పక్కదారి పట్టిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. 

 

Sunday, November 4, 2018 - 08:38

ప్రకాశం : ప్రజాస్వామ్యం ప్రమాదం బారిన పడినప్పుడు.. తనలాంటి వారు కూడా మౌనం వహిస్తే.. స్వాతంత్ర్యంకోసం పోరాడిన మహనీయుల ఆత్మ క్షోభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే.. జాతీయ కూటమికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను చంద్రబాబు తప్పుపట్టారు. బీజేపి రాసిచ్చిన...

Monday, October 29, 2018 - 11:40

ప్రకాశం : వేరే కులస్తులను ప్రేమించడం నేరమా ? వివాహం చేసుకోవద్దా ? ప్రేమించినా ? వివాహం చేసుకున్నా చంపేస్తారా ? గత కొన్ని రోజులుగా ఇలాంటి హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ పరువు పొతుందని స్వయంగా కుటుంబసభ్యులే అత్యంత దుర్మార్గానికి తెగబడుతున్నారు. కనిపెంచిన వారిపైనే దాడులు..హత్యలు చేస్తున్నారు....

Saturday, October 27, 2018 - 20:41

ప్రకాశం : జిల్లాలోని ఒంగోలు చర్చి సెంటర్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లా కోర్సులో సీటు రాలేదని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన పోలీసులు, స్థానికులు విద్యార్థిని అడ్డుకున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థిని విచారిస్తున్నారు. 

 

Saturday, October 6, 2018 - 09:04

ప్రకాశం : ఏపీలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు, సానుభూతిపరులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా డాడులు నిర్వహిస్తున్నారు. పక్కా ఆధారాలతో, అత్యంత గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. 

ప్రకాశం జిల్లా టీడీపీ నేతల్లో ఐటీ దాడులు గుబులు పుట్టిస్తున్నాయి. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామరావు ఇంటిలో...

Wednesday, September 26, 2018 - 21:19

ప్రకాశం : భారీ వర్షం పడుతోంది. భయంకరమైన ఉరుములు..మెరుపులు. వర్షం రావడంతో తలదాచుకోవడానికి ఓ ఫ్యాక్టరీలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో విషాదం నెలకొంది.  పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం చెందారు. నిర్మాణంలో ఉన్నగ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీపై పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

వర్షం రావడంతో తలదాచుకునేందుకు పలువురు కార్మికులు బల్లికురవలోని...

Sunday, September 16, 2018 - 17:11

ప్రకాశం : కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జిల్లా పంటపొలాల్లో పచ్చదనం పరచుకోనుంది. సాగునీటికి భరోసా కల్పించే మహత్తర ప్రణాళిక ఖరారైంది.  దశాబ్దానికిపైగా నత్తనడకన నడిచిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరడంతో.. భూములు సస్యశ్యామలం కానున్నాయి. మత్స్య, పాడి, పర్యాటక రంగాలు అభివృద్ది చెందనున్నాయి.  ఈనెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో...

Sunday, September 9, 2018 - 18:15

ప్రకాశం : ఏపీ రాష్ట్రంలో నలుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. ఈ విద్యార్థుల ఆచూకీ సాయంత్రం తెలిసింది. నిడమనూరు శ్రీ చైతన్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. గత రాత్రి ప్రిన్స్ పాల్ తీవ్రస్థాయిలో మందలించడమే కాకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి కర్రతో బాదాడని తల్లిదండ్రులకు తెలియచేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో కాలేజీ నుండి వెళ్లిపోవాలని భావించి పారిపోయాడు....

Monday, September 3, 2018 - 10:37

గుంటూరు : నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి నీరు విడుదల చేయడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత మూడేళ్లుగా సాగునీరులేక మెట్టపైర్లకే పరిమితమై అనేక ఇబ్బందులుపడ్డ రైతులు... ఈ ఏడాది వరి సాగుకు సమాయాత్తమవుతున్నారు. కుడి కాలువకు నీరు విడుదల చేయడంతో ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో సాగు సకాలంలో ప్రారంభంకానుంది. నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి అధికారులు ఎట్టకేలకు...

Pages

Don't Miss