ప్రకాశం
Tuesday, May 23, 2017 - 13:24

ప్రకాశం : వేమవరం జంట హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని అద్ధంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. ఆయన '10టివి'తో మాట్లాడారు...ఆయన ఈ రోజు ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో పాల డైరీకి చెందిన సభ జరిగింది. ఈ సభకు ఇరు వర్గాల వారు హాజరయ్యారు. ఇరు వర్గాల మధ్యఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గొట్టిపాటి రవి చొక్కి చినిగిపోయినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి...

Tuesday, May 23, 2017 - 11:48

ప్రకాశం : జిల్లా రాజధాని ఒంగోలులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి.

Monday, May 22, 2017 - 11:28

హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఫ్యాక్షన్‌ గొడవలు చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. హత్యా రాజకీయాలు సహించబోననే అధినేతకు... పార్టీలోని నేతల తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు తాజా ఘటనకు గొట్టిపాటిని టీడీపీలో చేర్చుకోవడమే కారణమని కరణం ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు ? పార్టీ సీనియర్లు ఏమంటున్నారు ?

...

Saturday, May 20, 2017 - 19:31

ప్రకాశం : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. బల్లికురువ మండలం వేమవరం సమీపంలో కరణం బలరాం వర్గానికి చెందిన వారిపై ప్రత్యర్థులు విచ్చు కత్తులతో విరుచుకుపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వారిపై కిరాతకంగా దాడి చేశారు. ఈ ప్రమాదంలో గోరంట్ల అంజయ్య, రామ కోటేశ్వరరావులు మృతి చెందగా.. పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు అనే నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

...

Saturday, May 20, 2017 - 13:38

ప్రకాశం : జిల్లాలో వర్గవిబేధాలలో గాయపడినవారిని.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కరణం బలరాం పరామర్శించారు. హత్యకు గురైన వారి మృతదేహాలను సందర్శించారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. 

Saturday, May 20, 2017 - 11:51

ప్రకాశం : వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటి రవికుమార్‌ చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసి హత్యాకాండకు తెర లేపుతున్నాడని ఎమ్మెల్సీ కరణం బలరాం ఆరోపిస్తున్నారు. తన వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు చేసిన దాడిపై కరణం బలరాం తీవ్రంగా మండిపడుతున్నాడు. గొట్టిపాటి ఓ దుర్మార్గుడని ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన గొట్టిపాటి దొంగల ముఠా..పార్టీలోకి...

Saturday, May 20, 2017 - 11:48

ప్రకాశం : జంట హత్యలతో ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొట్టిపాటి రవికుమార్‌ కరణం బలరాం వర్గీయుల మధ్య రాత్రి జరిగిన వర్గ విబేధాలు దాడిలో ఇద్దరు మృతిచెందడంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై..గొట్టిపాటి వర్గీయులు కర్రలు, కత్తులతో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో...

Pages

Don't Miss