ప్రకాశం
Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Wednesday, June 20, 2018 - 06:33

ప్రకాశం : కర్నాటక ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి ట్రైలర్‌ మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బీజేపీకి అసలైన సినిమా 2019లో ఉంటుందన్నారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా.. మాడిమసై పోతారని... ప్రధాని మోదీకి కూడా అదే గతిపడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో బీజేపీ భవిష్యత్‌ గల్లంతైందన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించిన లోకేష్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు...

Tuesday, June 19, 2018 - 12:35

ప్రకాశం : ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రకాశంజిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి రాక సందర్భంగా చీరాలలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని  సర్వజన వైద్యశాలలో 2కోట్లతో నిర్మించిన ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Wednesday, June 13, 2018 - 14:08

ప్రకాశం : పొదిలిలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ఒంగోలు కర్నూలు జిల్లా రహదారిపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

Wednesday, June 13, 2018 - 12:31

ప్రకాశం : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి పార్టీని వీడనున్నారా? పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని మహానాడు వేదికపై అసమ్మతి తెలిపిన మాగుంట అసలు ఎటు వెళ్లనున్నారు. తిరిగి సొంత గూటికి వెళతారా? లేక వైసీపీ, జనసేన పార్టీలవైపు చూస్తున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల్లో ఆసక్తి రేకిస్తున్నాయి. మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీని వీడి వేరే పార్టీలోకి...

Tuesday, June 12, 2018 - 19:41

ప్రకాశం : ప్రత్యేక హోదా కోసం జులై నుండి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. 24 గంటల పాటు ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామన్నారు. హోదా కోసం కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతామన్నారు. ఈ పోరాటంలో తమిళ చిత్ర సీమ నటులు కూడా పాల్గొంటారని తెలిపారు. 

Sunday, June 10, 2018 - 17:58

ప్రకాశం : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. మామిడిపాలెంలోని కొప్పోలు తిరుపతి రావు ఇంట్లో చొరబడి... 24 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు, కొన్ని పట్టుచీరలు చోరీ చేశారు. విహార యాత్రకి వెళ్లి వచ్చే సరికి ఇళ్లుగుల్ల చేశారని బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 

 

Sunday, June 10, 2018 - 15:59

ప్రకాశం : జిల్లాలో మిల్క్‌ట్యాంకర్‌ బోల్తా పడింది. యర్రగొండపాలెం  మండలం బోయలపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరుజిల్లా కలికిరి నుంచి నల్లగొండజిల్లా  చిట్యాలకు వెళ్లుతున్న వాహనం అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయింది. ట్యాంకర్‌ నుంచి కారిపోతున్న పాలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, బక్కెట్లతో పాలను తీసుకెళ్లుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వేల లీటర్లపాలు...

Wednesday, June 6, 2018 - 09:19

ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...

Monday, June 4, 2018 - 12:19

ప్రకాశం : జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో అతిసారం ప్రబలింది. అతిసారం వ్యాధి బారిన పడిన నాగమ్మ అనే వృద్ధురాలు వాంతులు, విరేచనాలు ఎక్కువ అవడంతో మరణించింది. ఈ వ్యాధితో గ్రామంలో మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్యాశాఖాధికారులు చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌లో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అతిసారం ప్రబలినట్లు వైద్యులు గుర్తించారు. 

...
Sunday, May 27, 2018 - 06:49

శ్రీకాకుళం : జనసేన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు సంఘీభావ దీక్షలు చేపట్టారు. ఉద్దానం బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు శ్రీకాకుళంలో దీక్ష చేస్తున్న పవన్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. పవన్‌ ఏ పోరాటం చేసినా అండగా ఉంటామని స్పష్టం చేశాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జనసేన...

Pages

Don't Miss