ప్రకాశం
Sunday, August 13, 2017 - 19:11

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు సాయి నగర్‌లో కాపురానికి తీసుకుపోవడం లేదని భర్త ఇంటి ముందు బైటాయించింది భార్య మౌనిక. మౌనికకు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పూనాటి బ్రహ్మయ్య కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో మౌనికను తన ఇంటికి పంపించేశాడు. ఆనాటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, విడాకుల నోటీసులు పంపించారని మౌనిక...

Saturday, August 12, 2017 - 21:53

ప్రకాశం : జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూముల్లో చెరువు తవ్వకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నీరు, ప్రగతి కార్యక్రమంలోభాగంగా దళితుల భూముల్లో చెరువు తవ్వేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై 10 TV వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... దళితుల భూముల్ని తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చింది. సర్కారు ప్రకటన స్థానికుల్లో సంతోషం నింపింది.. తమకు...

Saturday, August 12, 2017 - 09:06

ప్రకాశం : మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు..హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు ఏకలవ్యనగర్ లో మహిళ మృతదేహం బయటపడడం కలకలం రేగింది. ఎస్ఎస్ ట్యాంకు పక్కనే మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఖం గుర్తు పట్టకుండా ఉంది. వివాహిత కావచ్చని, 22 సంవత్సరాలు వయస్సు ఉంటుందని..అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు...

Thursday, August 10, 2017 - 17:22

ప్రకాశం : ఒంగోలు... కొత్తపట్నం బస్టాండ్‌లో... దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో రామారావు అనే వ్యక్తి... ఓ మహిళపై దాడి చేశాడు. గత కొంతకాలంగా పాదర్తి గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ....ఒంగోలుకు చెందిన రామారావు సహజీవనం సాగిస్తున్నారు..అయితే వెంకటేశ్వరమ్మ వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రామారావు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడిలో వెంకటేశ్వరమ్మ మెడ, తలపై...

Thursday, August 10, 2017 - 13:15

ప్రకాశం : దగ్గుబాటి రామానాయుడుకు చెందిన థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ థియేటర్ లో 'దగ్గుబాటి రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రమాదం వార్త తెలుసుకున్న దగ్గుబాటి సురేష్ హైదరాబాద్ నుండి చీరాలకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

చీరాలా పట్టణంలో సురేష్ మహల్ ఏసీ థియేటర్...

Tuesday, August 8, 2017 - 18:44

ప్రకాశం : వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే దేవరపల్లిలో దళితులకు ప్రభుత్వం భూములు తిరిగి ఇచ్చిందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ప్రకాశం జిల్లా పర్చూరులో దేవరపల్లి సంఘీభావ సదస్సులో పాల్గొన్న మధు... ఈ భూములను సాగు చేసుకునేందుకు అనుకూలంగా తీర్చిదిద్ది ఇచ్చినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. లేకపోతే... మళ్లీ పోరాటం చేస్తామని మధు స్పష్టం చేశారు.

Monday, August 7, 2017 - 21:55

ప్రకాశం : దేవరపల్లి దళితుల పోరు ఫలించింది. వీరి భూమిని లాక్కోవాలని భావించిన పాలకులు వెనక్కి తగ్గారు. దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలోని భూమిని వారికే అప్పగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై.. దేవరపల్లి దళితులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు తొలి నుంచీ అండగా ఉన్న సీపీఎం రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 
ఎట్టకేలకు కదిలిన ప్రభుత్వం  
...

Monday, August 7, 2017 - 19:12

ప్రకాశం : దేవరపల్లి దళితుల పోరాటం ఫలించింది. దళితులు విజయం సాధించారు. దళితుల భూములు దళితులకు సొంతమయ్యాయి. దేవరపల్లిలోని దళితుల భూములను తిరిగి వారికే ఇస్తామని మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు. దళితుల భూముల్లో తవ్విన చెరువును పూడ్చి వేస్తామన్నారు. చెరువు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చి దళితులకు అప్పచెబుతామన్నారు. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని...

Saturday, August 5, 2017 - 17:53

ప్రకాశం : ఇది ఎండాకాలం కాదు... అయినా అక్కడ ప్రజల గొంతులెండుతున్నాయి. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు.  నీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా  పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. దీంతో తాగునీరు కోసం వారంతా పోరుబాట పట్టారు.  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నీటి కష్టాలపై కథనం...
మంచినీరు దొరకక అల్లాడుతోన్న జనం...

Friday, August 4, 2017 - 08:08

ప్రకాశం : జిల్లా కనిరిగి మండలం కాశిరెడ్డి నగర్ లో రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లిబృందం బస్సు ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి తరలించారు. ఒంగోలు నుంచి వెలిగొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Tuesday, August 1, 2017 - 18:57

ప్రకాశం : లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు ఒంగోలు చెందిన అగ్నిమాపక అధికారి. వ్యాపార నిమిత్తం ఫైర్‌ అనుమతులు కావాలంటూ ఓ వ్యక్తి అగ్ని మాపక కార్యాలయంలో సుబ్బారావు అనే అధికారికి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు ఇవ్వకుండా 50వేల రూపాయలను డిమాండ్‌ చేయడంతో బాదితుడు 35వేలకు ఒప్పుకొని... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సుబ్బారావు... లంచం...

Pages

Don't Miss