ప్రకాశం
Wednesday, July 27, 2016 - 08:09

ప్రకాశం : ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చెన్నైకి బస్సు వెళుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తెల్లవారాముజామున కావడంతో ప్రయాణీకులు నిద్ర మత్తులో ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీనితో మేల్కొన్న ప్రయాణీకులు ప్రాణాలు రక్షించుకొనేందుకు బస్సులో నుండి దిగిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది ఉన్నారు....

Wednesday, July 27, 2016 - 06:34

విజయవాడ : చంద్రబాబు పాలనలో అవినీతి అట్టడుగు స్థాయికి తగ్గిపోయింది..పోలీస్‌శాఖతో సహా కరెప్షన్‌ తుడిచిపెట్టుకుపోతోంది.... ప్రభుత్వంపై ప్రజలు కొండత విశ్వాసంతో ఉన్నారు... వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై దాదాపు సగం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు..ఇదంతా మేమంటున్నది కాదు.. రెండేళ్ల పాలనపై ప్రభుత్వం జరిపిన పల్స్‌ సర్వేలో తేలిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. పల్స్‌ సర్వేలో జనం నాడి...

Wednesday, July 20, 2016 - 18:58

ప్రకాశం : పురుటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణీ శిశువుకు జన్మనిచ్చి చనిపోవడం కలకలం రేగింది. ఈ ఘటన చీరాలలో చోటు చేసుకుంది. భవానీకి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా డాక్టర్లు కాన్పు చేయడంతో ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే కాన్పు కోసం ముందుగా పీహెచ్ సీలో చేర్పించి, అక్కడ నుంచి చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించడంలో జాప్యం జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు....

Tuesday, July 19, 2016 - 18:31

ప్రకాశం : జిల్లా పొగాకు రైతును ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు దళారీ వ్యవస్థ.. నిలువునా దగా చేస్తున్నాయి. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం.. మార్కెట్లలో మోసాల ద్వారా దళారీ వ్యవస్థ.. రైతును ముంచేస్తున్నాయి. ఏటికేడు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశించడం.. ప్రతిసారీ నిరాశ చెందడం పొగాకు రైతుకు ఆనవాయితీగా మారింది. గిట్టుబాటు ధర రాక లబోదిబోమంటున్న ప్రకాశం జిల్లా పొగాకు రైతుల వేదనపై టెన్‌ టీవీ...

Friday, July 15, 2016 - 17:08

ప్రకాశం : పెరిగిన నిత్యవసరాల ధరలు, నిరుద్యోగ సమస్యకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా సీపీఎం ధర్నాలు నిర్వహిస్తుందని తెలిపారు.

Wednesday, July 13, 2016 - 10:47

ప్రకాశం : అసలే కడు పేదరికం. ఆ కన్న తల్లి రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ డొక్కలు నిండని పరిస్థితి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన కుమారుడికి అనారోగ్యం. కూలీ నాలీ చేసుకుని బతికే ఆమెది కుమారుడిని కాపాడుకోలేని దయనీయ పరిస్థితి. రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ తన కుమారున్ని ఆదుకోవాలని, దాతలు ఆర్థిక సాయం అందించాలని ఓ మాతృమూర్తి కోరుతోంది.
అవినాష్‌ కు...

Tuesday, July 12, 2016 - 17:02

హైదరాబాద్: కళ్లు చెదిరే అందాలు... జిగేల్‌మనిపించే లైట్ల మధ్య ..క్యాట్ వాక్ వయ్యారాలు..వింటుంటే..ఇదేదో మోడళ్ల షో...

Monday, July 11, 2016 - 09:10

ఢిల్లీ : శ్రీనగర్ లో తెలుగు యాత్రికులు అందరూ క్షేమంగా ఉన్నారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారంతా శ్రీనగర్ లో చిక్కుకపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీనగర్ లో ఘర్షణ మూలంగా కర్ఫ్యూ విధించారు. దీనితో అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. శ్రీనగర్ బేస్ క్యాంపు వద్దనున్న బల్తాన్ ప్రాంతంలో వీరంతా చిక్కుకపోయారు. సమాచారం అందుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారులతో మాట్లాడారు....

Monday, July 4, 2016 - 06:33

విజయవాడ : రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో అన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గతంలోలాగా... ఎరువులు, విత్తనాల కోసం.. రైతులు ఇబ్బందులు పడకుండా.. ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నైరుతి సీజన్ ఆరంభంలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది....

Thursday, June 30, 2016 - 10:41

ప్రకాశం : గతంలో రెండు నెలల క్రితం చిన్నారి అలేఖ్య కిడ్నాప్ కథ ఎట్టకేలకూ సుఖాంతమైంది. ఒంగోలు రైల్వే స్టేషన్ లో చిన్నారి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. చిన్నారి ఆచూకి దొరికిందని సమాచారం అందుకున్న పీఎస్ కు చేరుకున్న అలేఖ్య తల్లి తన బిడ్డ అలేఖ్యను గుర్తించింది. చైల్డ్ లైన్స్, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్...

Thursday, June 30, 2016 - 08:26

ప్రకాశం : మేదరమెట్ల బైపాస్ పై రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఆగి వున్న ఓ కారు ను లారీ ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా చికిత్స నందిస్తున్న సమయంలో తీవ్ర గయాలయిన నిత్య అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి...

Pages

Don't Miss