ప్రకాశం
Thursday, August 6, 2015 - 16:36

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో... ఆగస్టు 10వ తేదీలోపు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్‌యాత్ర ఒంగోలులో కొనసాగింది. ఈ యాత్రలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు ఇతర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు...

Saturday, August 1, 2015 - 07:19

ప్రకాశం : జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. తక్షణమే ఆయనను ఒంగోలులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కారు ముందుభాగం పాక్షికంగా ధ్వంసమైంది. కారులో ఎమ్మెల్యేతో పాటు ప్రయాణిస్తున్న కొండపి మార్కెట్‌ యార్డ్ ఛైర్మన్‌, గన్‌మెన్‌, డ్రైవర్‌లకు స్వల్ప...

Saturday, July 25, 2015 - 10:42

ప్రకాశం: గెలాక్సీ గ్రానైట్‌ అంటే ప్రపంచంలో ఎంతో పేరుంది. నల్లని అద్దంలా మెరవడమే కాకుండా.. బంగారు వర్ణంతో నింగిలో నక్షత్ర సమూహాన్ని తలపించేలా ఉండే ఈ గ్రానైట్‌తో వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే రాయిని అందంగా తీర్చుదిద్దుతున్న కార్మికుల బతుకులు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. యాజమాన్యాలకు తమ మొర ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు....

Friday, July 24, 2015 - 16:59

ప్రకాశం: జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఒంగోలులో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనకు వైసీపీ, ఉద్యోగసంఘాల నేతలు మద్దతు తెలిపారు. పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై... వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు...సమ్మెను...

Thursday, July 23, 2015 - 16:41

ప్రకాశం: మున్సిపల్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేతికి సంకేళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. ప్రభుత్వం...

Tuesday, July 21, 2015 - 09:17

తూర్పుగోదావరి : జిల్లా బెండపూడి వై జంక్షన్ వద్ద ఓ లారీ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు గోపిశెట్టి నారాయణరావు, పాపన రాముగా గుర్తించారు. గాయాలకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
...

Saturday, July 11, 2015 - 20:57

ప్రకాశం: సీఐటియూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఒంగోలులో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఇవాళ రేపు రెండు రోజుల పాటూ జరగనున్నాయి. ఈ కౌన్సిల్ సమావేశాల్లో పలు తీర్మాణాలు చేశారు. వీటిలో కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఈ నెల 14న అన్ని మున్సిపల్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు చేపట్టాలని...

Tuesday, July 7, 2015 - 10:28

ప్రకాశం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయబావుటా ఎగరవేసింది. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు. మొత్తం 992 ఓట్లకుగానూ... 755 ఓట్లు పోల్ అయ్యాయి. మాగుంటకు 724 ఓట్లు వచ్చాయి. 13 చెల్లని ఓట్లు పడ్డాయి. మాగుంట గెలుపుతో టిడిపి కార్యకర్తల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.

Tuesday, July 7, 2015 - 07:05

ప్రకాశం: జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ నేడు జరుగనుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టిడిపి నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసిపి నుంచి అట్ల చినవెంకటరెడ్డిలు బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలను వైసిపి ఇప్పటికే బహిష్కరించింది. ఈనెల 3న ఒంగోలు, కందుకూరు,...

Pages

Don't Miss