ప్రకాశం
Wednesday, May 2, 2018 - 16:40

ప్రకాశం : ఓ వైపు దేశం డిజిటల్‌ యుగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మూఢాఛారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కంపకల్లి పేరుతో ఒళ్ళు గగుర్పొరిచేలా సాగే.. సంప్రదాయ వేడుక మూఢ నమ్మకానికి పరాకాష్టగా మారింది. హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో ఈ వింత ఆచారం నేటికీ కొనసాగుతోంది. కంపకల్లి మూఢాఛారంపై టెన్‌టీవీ ప్రత్యక కథనం...టెక్నాలజీపరంగా దూసుకుపోతున్న...

Tuesday, May 1, 2018 - 13:23

ప్రకాశం : జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కార్మికులు మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో సీపీఎం నేతలు జెండాను ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లాలో మేడే వేడుకలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

Monday, April 30, 2018 - 11:23

ప్రకాశం : వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనకమిట్ట మండలం గొట్లగట్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఓ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు దగ్గర అతివేగంగా వచ్చిన లారీ.. ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఖాదర్‌, ప్రుకాను, వెంటకరెడ్డి...

Tuesday, April 24, 2018 - 13:35

ప్రకాశం : జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతుండడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. బావులు, చెలిమేల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణాల్లోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో మహిళలకు నీటి ట్యాంకర్ల దగ్గర బిందెల యుద్ధం తప్పడం లేదు. 

వేసవి ప్రారంభంలోనే ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వర్షాభావానికి తోడు, ముందు...

Friday, April 20, 2018 - 21:07

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కదిలాయి. జిల్లాకేంద్రాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లో దీక్షలు చేపట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా,...

Wednesday, April 18, 2018 - 18:42

ప్రకాశం : జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు, సీఈవో కైలాష్‌ మధ్య వివాదం చెలరేగింది. సీఈవో నిబంధనల ప్రకారం వేదికపై కూర్చునే అర్హత లేదని ఈదర హరిబాబు అన్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్‌కు కొంతమంది, సీఈవోకు మరికొంత మద్దతు ఇవ్వడం గందరగోళం నెలకొంది. ఎవరూ చెప్పినా వినకపోవడంతో... జడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. 

Monday, April 16, 2018 - 17:00

ప్రకాశం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్‌ ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు  స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలో జరగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని...

Monday, April 16, 2018 - 11:45

ప్రకాశం : జిల్లాలోని బంద్ కొనసాగుతోంది. ఉదయం 4గంటల నుండే అన్ని డిపోల ఎదుట వామపక్ష, వైసీపీ నేతలు బైఠాయించారు. దీనితో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 840 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎనిమిది ఆర్టీసీ డిపోల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Pages

Don't Miss