ప్రకాశం
Friday, January 19, 2018 - 12:25

ప్రకాశం : ఒకటా రెండా.. నిత్యం ఎన్నో దాడులు.. ఎన్నో ఆకృత్యాలు.. మరెన్నో దారుణాలు. దేశమంతటా గాయాల పచ్చివాసన. గ్రామాల్లో, పట్టణాల్లో దళితులపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి..దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది..కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయతీలో అగ్రవర్ణాల ఆగడాలు శృతిమించాయి.

బొడ్డురాయిని ఏర్పాటు చేయడంతో అటువైపు దళితులను అగ్రవర్ణాలు రానివ్వడం లేదు. దళితులు గ్రామంలోకి...

Wednesday, January 17, 2018 - 18:46

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నంలో ఎడ్ల పందాలు ఘనంగా జరిగాయి. మూడేళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి నాటుబండి లాగుడు పోటీలకు మొత్తం 15 ఎడ్లజతలు వచ్చాయి. ఎడ్ల బల ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Wednesday, January 17, 2018 - 06:40

ప్రకాశం : జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నవ్య కేబుల్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. బజర్దస్త్‌ నటులు చిత్రం శీను, ఫణి, బుల్లితెర నటుడు అజయ్‌ ఘోష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటులు, జానపద నృత్యాలతో కార్యక్రమం అలరించింది.

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో...

Monday, January 15, 2018 - 08:04

ప్రకాశం : జిల్లాలోని సీఎస్‌ పురం మండలం ఉప్పలపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సంక్రాంతి సందర్భంగా దేవాలయం వద్ద మైక్‌ పెట్టిన అంశంపై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీనికి రాజకీయరంగు పులుముకోవడంతో వివాదం పెద్దదైంది. ఘర్షణలో గాయపడ్డ రాధాకృష్ణారెడ్డి కనిగిరి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. విషయం పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.

 

Monday, January 15, 2018 - 07:27

ప్రకాశం : జిల్లాలోని అద్దంకి, బల్లికువర పోలీసులు కోడిపందేల స్థావరాలపై దాడుల చేశారు. ఈ దాడుల్లో  15 కోళ్లతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. పందేలు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. చట్ట ప్రకారం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అద్దంకి ఎస్సై సుబ్బరాజు చెప్పారు.
 

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Saturday, January 13, 2018 - 09:38

ఏలూరు : సీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌తో ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ సంఘాలు ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగాయి. ధర్నాకు దిగిన ఉద్యోగులతో  10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

Friday, January 5, 2018 - 09:10

గుంటూరు : రేపల్లె పీఎస్ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేగింది. ఇటీవలే మైనర్ బాలికను శ్రీనివాసరావు అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 31న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పీఎస్ లోని బాత్ రూంకు వెళ్లిన శ్రీనివాసరావు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనితో ఒక్కసారిగా పీఎస్ లో కలకలం రేగింది. మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా ? ఇతరత్రా కారణాలున్నాయా ?...

Thursday, January 4, 2018 - 11:59

కాకినాడ : జేఎన్టీయూలో గౌరవ డాక్టరేట్ వివాదం చెలరేగుతోంది. బీవీ మోహన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు..అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఒక పాలక మండలి సభ్యుడిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జేఎన్టీయూలోని అధికారులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతితో అవార్డును ప్రకటించామని జేఎన్టీయూ వీసీ...

Pages

Don't Miss