ప్రకాశం
Saturday, July 8, 2017 - 06:46

ప్రకాశం : దర్గాకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కావలికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో హైదరాబాద్ లోని దర్గాకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద ఇన్నోవా కారు ఆగివున్న లారీని అతివేగంతో ఢీకొట్టింది....

Thursday, July 6, 2017 - 21:19

ప్రకాశం : మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్టుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే అరెస్టుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ముందు హడావుడి చేశారు. అంతలోనే బెయిల్‌ రావడంతో ఆర్ కే బయటకురావడంతో కార్యకర్తలు శాంతించారు. పెనుమాక భూసేకరణ సదస్సులో అధికారులతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్...

Thursday, July 6, 2017 - 19:56

ప్రకాశం : తొలి ఏకాదశి రోజున నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే తిరునాళ్లు అంబరాన్ని అంటుతాయి. ప్రకాశం జిల్లాలో కృష్ణానది పక్కన శ్రీశైలం ఉత్తర భాగంలో వెలిసిన పాలంకస్వామికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. 
తిరునాళ్లు 
ఆషాడ మాసం తొలి...

Wednesday, July 5, 2017 - 21:51

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్‌ అడ్డరోడు వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

Wednesday, July 5, 2017 - 19:54

ప్రకాశం : ఒంగోలులో హీరోయిన్‌ కేథరిన్‌ సందడి చేసింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓ మొబైల్ షాపును కేథరిన్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఒంగోలులో ఇలాంటి ప్రారంభోత్సవానికి పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కేథరిన్‌ అన్నారు. ఈ సందర్భంగా కేథరిన్‌ను చూడడానికి వేలాదిమంది ఎగబడ్డారు.

 

Wednesday, July 5, 2017 - 19:32

ప్రకాశం : జిల్లాలోని చీమకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లోడుతో వస్తోన్న టిప్పర్ ... కారుని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం గర్భిణి బానూరి రమాదేవి, ఆమె బంధువులు వెలిగండ్ల మండలం నాగులవరం నుంచి కారులో బయలుదేరారు. అయితే చీమకుర్తి వద్ద ఓ టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బలంగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో  రమాదేవి...

Tuesday, July 4, 2017 - 06:37

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కార్మికవర్గం హక్కుల సాధనకు సమరశంఖం పూరించింది. సమస్యల పరిష్కారం కోరుతూ కోరుతూ కదం తొక్కింది. కనీస వేతన చట్టాలను అమలుచేయాలంటూ పలుచోట్ల కలెక్టరేట్లను కార్మికులు ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని కార్మిక నేతలు ధ్వజమెత్తారు. కార్మిక సమస్యలు...

Saturday, July 1, 2017 - 09:44

ప్రకాశం : జిల్లాలో సబ్సిడీ విత్తనాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.. కందుకూరు పోతురాజుమిట్ట దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ విత్తనాలను తీసుకువెళుతున్న లారీ కనిపించింది.. లారీలో 10లక్షల రూపాయల విలువైన 12 టన్నుల విత్తనాలు పోలీసులు గుర్తించారు.. ఈ విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు..

 

Thursday, June 29, 2017 - 08:53

ప్రకాశం : జిల్లాలో దారుణం జరిగింది. మానవవత్వం మంటగలిసింది. నవ మాసాలు మోసి, కనిపెంచిన కన్నతల్లిని హతమార్చాడు ఓ ప్రభుద్ధుడు. మార్కాపురంలో ఆస్తి తగాదాలతో కొడుకు తల్లిని హత్య చేశాడు. మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు సమచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, June 26, 2017 - 17:38

ప్రకాశం : ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు....పార్టీలో ప్రముఖ వ్యక్తి ... మంత్రిగా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పుతున్నాడు... ఆయనుంటే.. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు సైతం బుద్ధిగా నడుచుకుంటున్నారు. అసలు ఆ మంత్రి ఎవరు? ఆయన హవా ఏంటి?
మంత్రి నారాయణకు సీఎం పెద్దపీట
ప్రస్తుతం టీడీపీలో మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలకంగా మారారు. కచ్చితమైన...

Pages

Don't Miss