రంగారెడ్డి
Sunday, July 15, 2018 - 11:06

రంగారెడ్డి : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఎల్బీ నగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి... ముగ్గురు ఏసీపీలు 17 మంది సీఐలు కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఆధార్‌కార్డులు పరిశీలించారు... అనుమానితుల వద్ద వేలిముద్రలు సేకరించారు. ఈ తనిఖీల్లో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు....

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Tuesday, July 10, 2018 - 11:27

 రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధి తారామతిపేటలో స్కూల్‌ బస్సు కిందపడి మూడు సంవత్సరాల తన్విష్‌ మృతి చెందాడు. స్థానిక శాంతినికేతన్‌ స్కూల్‌కు వెళుతున్న తన్వీష్‌.. బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Tuesday, July 10, 2018 - 10:00

రంగారెడ్డి : ప్రైవేట్ స్కూల్ బస్సులు విద్యార్థుల పాలిట మృత్యు శకటాలుగా మారాయి. స్కూల్ పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. విద్యాలయాలకు విద్యార్థులను క్షేమంగా చేరవేయాల్సి బస్సులు వారి పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా స్కూల్ బస్సు మరో విద్యార్థిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధి...

Friday, July 6, 2018 - 19:41

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ ఎండీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. శంషాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు లేక రోగులు అవస్థలు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

Monday, July 2, 2018 - 13:41

రంగారెడ్డి : ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఇంకా సంధిగ్ధమే... కానీ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అప్పుడే ఎన్నికల వాతవారణాన్ని సృష్టించారు ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌. రాజకీయ విమర్శలతోనే కాదు.. వ్యక్తగత దూషణలతోనూ రాజకీయ రచ్చ చేస్తున్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Monday, June 25, 2018 - 11:31

రంగారెడ్డి : నాన్న..అని అనుకుంటూ వెళ్లిన ఐదేళ్ల చిన్నారి తీరనిలోకాలకు వెళ్లిపోయింది. తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ విషాద ఘటన షాబాద్ మండలం గోపిగూడలో చోటు చేసుకుంది. కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లిన తండ్రి వెంట చిన్నారి అవ్య (5) పరుగెత్తింది. బస్సు దగ్గర చిన్నారి ఉన్నట్లు డ్రైవర్ కనిపించక ముందుకు పోనిచ్చాడు. దీనితో టైర్ల...

Monday, June 25, 2018 - 08:14

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమౌతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్..అతివేగంగా ప్రయాణిస్తూ మృత్యులోకాలకు వెళుతున్నారు. ఆదివారం యాదాద్రి వేములకొండ వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందిన సంగతి మరిచిపోకముందే రంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో కుటుంబాలు...

Monday, June 25, 2018 - 06:39

రంగారెడ్డి : మహేశ్వరం నియోజకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది. అందులో మీర్‌పేట మంత్రాల చెరువు, పెద్ద చెరువు, జిల్లెలగూడ సంద చెరువులు డ్రైనేజీలు, రసాయన వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో ఆ చెరువులను శుద్ధి చేసేందుకు ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఆ ప్రాంతం వాసులు. చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 3 లక్షల మంది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ చెరువులో...

Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Pages

Don't Miss