రంగారెడ్డి
Thursday, January 19, 2017 - 18:53

రంగారెడ్డి : పశు సంక్రాంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా పశుసంత కనుల పండువగా జరుగనుంది. జాతీయస్థాయి గేదెల జాతర ఘనంగా జరగనుంది.  దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  
అన్ని రాష్ట్రాల పశువుల క్రయవిక్రయాలు
రంగారెడ్డి జిల్లా.. గండిపేట్‌ మండలం... నార్సింగి గ్రామంలో రేపటి నుంచి పశువుల జాతర పెద్దఎత్తున జరగనుంది. ఈ...

Monday, January 9, 2017 - 20:50

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్ధి వ్యతిరేఖ విధానాలపై ఎస్ఎఫ్ఐ మహాసభ 15 తీర్మానాలు చేసింది. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.

93 మందితో నూతన రాష్ట్ర కమిటి ఏర్పాటు
కేంద్ర, రాష్ట్ర...

Sunday, January 8, 2017 - 17:08

రంగారెడ్డి : జిల్లాలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. సదాశివపేట నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు మార్గంమధ్యలో నార్సింగి పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, January 2, 2017 - 13:13

హైదరాబాద్ : న్యూస్ ఈజ్ పీపుల్ అంటూ ప్రజల సమస్యల కోసం 10టీవీ చానల్ పాటుపడడం అభినందీయమని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10టీవీ 2017 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను నిష్పాక్షితంగా వెలుగులోకి తెస్తోందని కొనియాడారు. ఇలాగే ప్రజల తరపున 10టీవీ నిరంతరం పోరాడాలని సూచించారు.

Sunday, January 1, 2017 - 13:38

రంగారెడ్డి : సామాజిక సమస్యలను ప్రజల దృష్టికి తేవడంలో 10 టీవీ ముందంజలో  ఉంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ అతిథి గృహంలో ఆయన 10 టీవీ 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 

 

Saturday, December 24, 2016 - 16:05

రంగారెడ్డి : జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్‌ మండలం మదనపల్లిలోని ఓ ఫాంహౌస్‌పై డీఆర్‌ఐ అధికారుల దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అధికారులు ఒక లారీని సీజ్‌ చేశారు. ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, December 22, 2016 - 18:42

రంగారెడ్డి : జిల్లాలోని పెద్ద అంబర్‌ పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 6 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 

 

Thursday, December 15, 2016 - 12:51

రంగారెడ్డి : ప్రేమపేరుతో వేధింపులు తాళలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌ మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన శరణ్య... కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదేగ్రామానికి చెందిన నర్సింగ్, నర్సింగరావు ఇద్దరు యువకులు ఒకరితెలియకుండా మరొకరు శరణ్యను ప్రేమించారు. నర్సింగ్ (ఆటో డ్రైవర్), కాగా నర్సింగరావు అదే...

Pages

Don't Miss