రంగారెడ్డి
Thursday, March 23, 2017 - 07:52

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌..రంగారెడ్డి..హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో జనార్థన్‌రెడ్డికి 9734 ఓట్లు రాగా..తన ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిపై 4,639 ఓట్ల తేడాతో జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు...

Wednesday, March 22, 2017 - 08:09

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 12మంది అభ్యర్ధులు పోటిప‌డుతున్న ఈ ఎన్నిక‌లో ఫోటోల మార్ఫింగ్‌తో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. బుధవారం జరిగే కౌటింగ్ కోసం.. అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
ఓటు హ‌క్కు వినియోగించుకున్న 19,624 మంది...

Sunday, March 19, 2017 - 08:35

రంగారెడ్డి : బాచుపల్లిలో అర్ధరాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ప్రిన్సిపల్ తోపాటు సెక్యూరిటీ గార్డుపై విద్యార్థులు దాడి చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న బస్సుపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి...

Saturday, March 18, 2017 - 19:42

రంగారెడ్డి : షాద్‌నగర్‌ బస్టాండ్‌ పార్కింగ్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో భారీగా వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది...మంటలార్పుతున్నారు. 

 

Thursday, March 16, 2017 - 19:50

రంగారెడ్డి : జిల్లాలో కన్నకొడుకుపై కసాయి తల్లి కర్కషత్వం వెలుగుచూసింది. భర్తపై కోపంతో... కన్నకొడుకైన 8 ఏళ్ల హర్షవర్థన్‌ శరీరంపై తల్లి అనూష.. వాతలు పెట్టింది. దీంతో బాలుడి తండ్రి మురళీ కృష్ణ.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనూషకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని.. అప్పటినుంచి పిల్లలపై క్రూరంగా వ్యవహిరిస్తోందని మురళీ కృష్ణ వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు......

Thursday, March 16, 2017 - 13:34

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ఈ పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర మార్చి 19వ తేదీన ముగియనుంది. 'సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం' పేరిట సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు చురుగ్గా...

Wednesday, March 8, 2017 - 17:43

రంగారెడ్డి : తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. ఇవాళ నల్లగొండ జిల్లాలోని రాందాస్‌తండా, నర్సింహులగూడెం, తుమ్మలపల్లి, చండూరు, పొనుగోడు స్టేజ్‌, కురంపల్లి, జి.ఎడవల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతోంది...

Wednesday, March 8, 2017 - 17:41

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లలో ఏబీసీడీ కేటగిరి పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎంబీసీలకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ప్రకటించారని..అమల్లోకి వస్తుందో లేదో అన్న అనుమానం కూడా తమకు ఉందన్నారు. ఏఏ కులాలు ఎంబీసీలో వస్తాయో అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పించాలన్నారు. బీసీ కమిషన్‌తో గుర్తింపు...

Wednesday, March 8, 2017 - 15:59

రంగారెడ్డి :మొయినాబాద్‌ (మం) తొల్కట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బోరుమోటర్‌ స్టార్టర్‌కు ఫ్యూజ్‌ వేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి తండ్రీకొడుకులు మృతిచెందారు. బొలిగిద రవికుమార్‌, అతని కొడుకు ఫ్యూజ్‌ సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Friday, March 3, 2017 - 16:22

రంగారెడ్డి : తూర్కయాంజిల్‌లో జరిగిన గుంటి రాజేష్ హత్య కేసులోని ప్రధాన నిందింతులను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే రాజేష్‌ హత్య జరిగిందన్నారు. తన కూతురు అనూష ఆత్మహత్యకు ప్రతీకారంగా శ్యాంసుందర్ రెడ్డి, అతని స్నేహితులు, కిరాయి హంతకులతో కలిసి రాజేష్‌ను హతమార్చారని చెప్పారు. 

Pages

Don't Miss