రంగారెడ్డి
Saturday, August 5, 2017 - 18:14

రంగారెడ్డి : బంగారు ఆభరణాలతో ఉడాయించిన...ఓ నగల వ్యాపారి షాపు ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఓ జ్యూవెలరీ షాపు యజమాని... తన కస్టమర్ల వద్ద తీసుకున్న బంగారం..నగదుతో ఉడాయించాడు. దీంతో మోసపోయిన ఐదు వందల మంది బాధితులు షాపు ముందు ధర్నా చేపట్టారు. అనంతరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Thursday, August 3, 2017 - 12:33

రంగారెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా.. రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. బాలకృష్ణ 102వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌నిచ్చారు. క్రిష్‌ కెమెరా స్విచ్‌ను ఆన్‌ చేశారు. 

Wednesday, August 2, 2017 - 13:35

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ హార్టీకల్చర్‌ యూనివర్శిటీలో.. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఉదయం అరెస్ట్‌ చేశారు. దీంతో స్టూడెంట్స్ ధర్నా నిర్వహించి.. రోడ్డుపై బైటాయించారు. విద్యార్థులకు మద్దతుగా టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను...

Wednesday, August 2, 2017 - 12:58

రంగారెడ్డి : హార్టికల్చర్‌ విద్యార్థులపై పోలీసులతీరుకు నిరసనగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.. హార్టికల్చర్‌ విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు.

Wednesday, August 2, 2017 - 09:20

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేయడంతో పాటు యూనివర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం వీడియో చూడండి.

Wednesday, August 2, 2017 - 08:24

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేయడంతో పాటు యూనివర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం వీడియో చూడండి.

Tuesday, August 1, 2017 - 16:56

రంగారెడ్డి : కడ్తాల్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై మనీష్‌ గౌడ్‌ అనుచరుల దాడికేసులో నిందితులకు కల్వకుర్తి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మనీష్‌గౌడ్‌తో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బీఎన్‌ రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న తనయుడు మనీష్‌ గౌడ్ రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మైసిగండి దగ్గర టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడికి దిగాడు. టోల్‌ ఫీజు...

Tuesday, August 1, 2017 - 11:40

రంగారెడ్డి : జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లిలో ఆకతాయిలు ఎక్కువయ్యారు. కొందరు ఆకతాయిలు నిత్యం యువతులను వెంబడిస్తూ వేధిస్తున్నారు. వట్టేపల్లి నుంచి ఆబిడ్స్‌కు ఆటోలో బయలుదేరిన ఇద్దరు యువతులను ఆరుగురు ఆకతాయిలు వేధించారు. ఆటో డ్రైవర్‌ను కిందకు దింపి యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఆకతాయిల బెదింపులకు లొంగకుండా...

Tuesday, August 1, 2017 - 10:18

రంగారెడ్డి : నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తనయుడు మనీష్ గౌడ్ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసగండి టోల్ గేట్ దగ్గర సిబ్బందిపై దాడి చేశాడు. టోల్ చార్జ్ అడిగినందుకు కత్తులతో మనీష్ గౌడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మనీష్ గౌడ్ అతని స్నేహితులు కడ్తాల్ పోలీసుల అదుపులో ఉన్నారు....

Pages

Don't Miss